Uncategorized
విద్యుత్ ఘాతంతో ప్రమాదవశాత్తు తల్లి, కొడుకు మృతి !

విద్యుత్ ఘాతంతో ప్రమాదవశాత్తు తల్లి, కొడుకు మృతి !
క్యాపిటల్ వాయిస్, కారంపూడి :- పల్నాడు జిల్లా కారంపూడి లోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో విద్యుత్ ఘాతంతో అంగడి నాగమ్మ (50) అంగడి రామ కోటేశ్వరరావు (30) మృతి చెందారు. నివాస గృహంలో బట్టలు ఆరవేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.. మృతుడు రామకోటేశ్వరావుకు ఇద్దరు పిల్లలు కలిగి ఉన్నారు ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన కారంపూడి ఎస్సై రామాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.