వాలంటీర్లు సేవలు అమోఘం, 8వ వార్డు కార్పొరేటర్ అప్పారావు

వాలంటీర్లు సేవలు అమోఘం……. 8వ వార్డు కార్పొరేటర్ అప్పారావు…….
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో వాలంటీర్లు సేవలు అమోఘమని ఎనిమిదో వార్డ్ కార్పొరేటర్ ఎల్. అప్పారావు పేర్కొన్నారు. 53 వ వార్డు సచివాలయంలో ప్రజలకు మంచి సేవలందించిన వాలంటీర్లకు సేవా మిత్ర పరిష్కారాలు, అందజేశారు. సమాజానికి సేవ చేసే అదృష్టం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు కు కల్పించారని దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా తమ తన అనే భేదం లేకుండా అందరికీ అందివ్వాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా వాలంటీర్లు నిలుస్తున్నారని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటూ అమోఘమైన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అధికారులు అడ్మిన్ వెంకట్, సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు, 8వ వార్డు వైసిపి అధ్యక్షులు రామ్మోహన్రావు,స్థానిక వైసీపీ మహిళా పార్లమెంట్ జనరల్ సెక్రెటరీముదుండి రాజేశ్వరి, శివ, రమణ మూర్తి,… రమాదేవి…..రజనీ. మహిళా కార్యకర్తలుస్థానిక నేత టేకు పూడి నర్సింగరావు పాల్గొన్నారు.