వాటాలు సక్రమంగా పంచేందుకే సజ్జల నెల్లూరు వచ్చారు : టీడీపీ అబ్దుల్ అజీజ్

వాటాలు సక్రమంగా పంచేందుకే సజ్జల నెల్లూరు వచ్చారు : టీడీపీ అబ్దుల్ అజీజ్
క్యాపిటల్ వాయిస్ జిల్లా ప్రతినిధి, నెల్లూరు :-అవినీతి, అక్రమాలు, ఇసుక రీచ్ లలో వాటాలు, దోపిడీ , బినామీ కాంట్రాక్టర్లతో పనులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భ్రష్టుపట్టి పోయిందని టిడిపి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ధ్వజమెత్తారు..
నెల్లూరు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో సహజ వనరులను దోపిడీ, సాగునీటి ప్రాజెక్టులు , ఇసుక రీచ్ ల అవినీతి అక్రమ సంపాదన లో వైయస్సార్ కాంగ్రెస్ నాయకుల మధ్య వచ్చిన ఆధిపత్య పోరు, విభేదాలను సర్దిచెప్పేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నెల్లూరుకు వచ్చారని అబ్దుల్ అజీజ్ ఎద్దేవా చేశారు.
నెల్లూరు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులతో గంటల తరబడి ముచ్చటించిన సజ్జల ఏ విధంగా పంచుకోవాలో చెప్పకనే చెప్పారన్నారు.. వాటాలు ఎలా తీసుకోవాలో ఒకరికొకరు ఫిర్యాదులు చేసుకుని, ఒకరిపై ఒకరు అధికారులకు ఫిర్యాదులు చేసుకోకుండా ప్రజలకు తెలియకుండా స్త్రా పెట్టి… లస్సి తాగిన చందంగా బయటకు తెలియకుండా ఎలా వాటాలు తీసుకోవాల్ సజ్జల సలహా ఇచ్చి నెల్లూరు వైఎస్ఆర్ నేతలకు జ్ఞానోదయం చేసి పంపారన్నారు… నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల దోపిడి ఇలా ఉందని తన దైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.