లక్ష్మీ దేవి అమ్మవారి ఆలయంలో ఘనంగా అన్నసంతర్పణ. ముఖ్య అతిథులుగా పాల్గొన్న 5,7వార్డుల కార్పొరేటర్లు.

లక్ష్మీ దేవి అమ్మవారి ఆలయంలో ఘనంగా అన్నసంతర్పణ. ముఖ్య అతిథులుగా పాల్గొన్న 5,7వార్డుల కార్పొరేటర్లు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
మధురవాడ జీవీఎంసీ జోన్-2 మధురవాడ 5,7, వార్డుల పరిధి స్వతంత్రనగర్ లో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.నవరాత్రుల్లో 4వ రోజు శ్రీలక్ష్మీదేవి అమ్మవారు శ్రీలలితా త్రిపురసుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.ఈసందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 7వ వార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ, 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత,జిల్లా టిడిపి నాయకులు పిల్లావెంకటరావు, మొల్లిలక్ష్మణరావు పాల్గొని అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.కార్యక్రమంలో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ దేవి అమ్మవారి ఆలయ కమిటీ అధ్యక్షులు వాసుపిల్లి బండియ్యా,కొత్తల శ్రీను,దాది గౌరీశంకర్,కూనరమేష్, దిబ్బశ్రీను,బావిశెట్టి జగన్ అనుపోజు నాగరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు లంక పొట్టి ప్రసాద్, 5 వ వార్డ్ తెలుగు యువత అధ్యక్షులు కొండపు రాజు,నరేంద్ర అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.