Andhra PradeshVisakhapatnam
రోడ్లకు మోక్షం ఎప్పుడు ?.. సొంత నిధులతో మరమ్మతులు చేస్తే అరెస్టుల?..డాక్టర్ సందీప్ పంచకర్ల..

రోడ్లకు మోక్షం ఎప్పుడు ?.. సొంత నిధులతో మరమ్మతులు చేస్తే అరెస్టుల?..డాక్టర్ సందీప్ పంచకర్ల..
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ 6వ వార్డు బక్కన్నపాలెం లో పూర్తిగా మరమ్మతులకు గురై నడవడానికి వీలులేకుండా తయారైన రోడ్డును జనసేన కార్యకర్తలు రోడ్లు మరమ్మతుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా జనసేన నాయకులను కార్యకర్తలను పీ.ఎం.పాలెం పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు.జనసేన భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.జీవీఎంసీ 6వ వార్డు పరిధిలో స్థానిక గ్రామమైన బక్కన్నపాలెంలో నడవడానికి వీలులేకుండా ప్రధాన రోడ్లు మరమ్మతులకు గురిఅయ్యాయి.దీంతో జనసేన కార్యకర్తలు రోడ్లు మరమ్మతుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా భీమిలి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ సందీప్ పంచకర్ల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మరమ్మత్తులు చేసుకోకపోతే అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి జనసేన పార్టీ రోడ్లకు మరమ్మతులు చేసే కార్యక్రమం చేపడతామని ముందే ప్రభుత్వానికి హెచ్చరించామని,జనసేన కార్యకర్తలు సొంత నిధులతో రాష్ట్రమంతా రోడ్లకు మరమ్మతులు కార్యక్రమం చేస్తుందని గుర్తుచేశారు.చేసే మంచి పనిని ప్రోత్సహించడం పోయి పోలీసులతో ఎక్కడెక్కడ అణచివేసే కార్యక్రమాన్నిచేపట్టడం దురదృష్టకరమని అన్నారు.
ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ముందు ఉంటాయని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి అవంతి శ్రీనివాస్, మరియు గత స్థానిక ఎన్నికలలో గెలుపొందిన కార్పొరేటర్,స్థానిక మంత్రి అమ్మాయి త్వరలోనే బక్కన్నపాలెం రోడ్ల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి,రోజులు, నెలలు, గడిచిన పట్టించుకునే నాధుడే లేరని ఎద్దేవా చేశారు.జనసేన కార్యకర్తలు సమానత్వంతో పనిచేస్తారని కితాబిచ్చారు. మరమ్మతులకు గురైన రోడ్లపైనే గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేశారు.ఈ కార్యక్రమంలో బి.వి కృష్ణయ్య, జనసేన పార్టీ సీనియర్ నాయకులు,6వవార్డు మహిళా నాయకురాలు పోతినఅనురాధ, నానాజీ, 6వ వార్డు అధ్యక్షులు సంతోష్ నాయుడు,సత్యనారాయణ, శాఖరిశీను,ఎడ్ల గణేష్ మరియు స్థానిక జనసేన నాయకులు రామా రావు,అనిల్,సాయి,శ్రీను, ప్రియాంక బరాటం,సంతోష్ బరాటం,నాని,ఆకుల రామకృష్ణ,అనిల్, సుబ్రహ్మణ్యం, ప్రసాద్, ప్రకాష్,దుర్గ,శ్రీకాంత్, నాగోతి ప్రకాష్,పాల్గొన్నారు.

