Politics

రేపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు భారత్ బంద్‌

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న రైతులు మంగళవారం భారత్ బంద్‌కు సిద్ధమవుతున్నారు. తాము జరపబోయే ఈ శాంతియుత బంద్‌కు ప్రజలందరూ సహకరించాలని వాళ్లు కోరారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భారత్ బంద్ ఉంటుందని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేష్ తికాయిత్ వెల్లడించారు. తమ నిరసనలు సాధారణ పౌరులను ఇబ్బంది పెట్టడానికి కాదని ఆయన స్పష్టం చేశారు. ఉదయం 11 గంటలకు బంద్ మొదలుపెడతాం. ఎందుకంటే ఆలోపే అందరూ ఆఫీస్‌లకు వెళ్లిపోతారు. అత్యవసర సేవలైన అంబులెన్స్‌లతోపాటు పెళ్లిళ్లు కూడా జరుగుతాయి అని రాకేష్ చెప్పారు. మరోవైపు రైతులకు మద్దతుగా అన్ని మోటార్ ట్రాన్స్‌పోర్ట్ యూనియన్లు తమ వాహనాలను నిలిపివేయడంతో సరుకుల రవాణా స్తంభించనుంది. ఇప్పటికే ఎన్డీయేతర రాజకీయ పార్టీలన్నీ ఈ బంద్‌కు, రైతుల నిరసనకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: Content is protected !!
%d bloggers like this: