రెగ్యులారీటీ కమిటీ పేరుతో పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి : చుక్క చంద్ర పాల్

రెగ్యులారీటీ కమిటీ పేరుతో పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలి : చుక్క చంద్ర పాల్
క్యాపిటల్ వాయిస్, (గుంటూరు జిల్లా) సత్తెనపల్లి : నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాసరి జ్ఞాన రాజ్ పాల్ ఆధ్వర్యంలో ఏపీ ఎస్ పి డి సి ఎల్ ఆఫీస్ వరకు ర్యాలీగా బయలుదేరి వెళ్లి ఎలక్ట్రికల్ ఇంజినీర్ కి పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని వినతిపత్రాన్ని సమర్పించారు. పార్టీ సమన్వయకర్త శ్రీ చుక్క చంద్ర పాల్ మాట్లాడుతూ 2014 నుండి విద్యుత్ పంపిణీ ఉత్పత్తుల్లో వచ్చిన లోటును ఇప్పుడు ప్రజల నుండి వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రజలకు వివిధ పథకాల పేరుతో నగదు బదిలీ చేస్తున్న ప్రభుత్వం ఛార్జీల పేరుతో భారాలు వేసి వసూలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక ఒక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని, సాధారణ మధ్య తరగతి ప్రజలు పై మరింత భారంవేస్తుందని, ఎక్కువ చార్జీలు ఇవి చాలనట్లు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్న మనదేశంలో మాత్రం పెట్రోలు ఉత్పత్తులపై పన్నులు పెంచుతూ పోతున్నాయన్నారు. 2000 సంవత్సరం విద్యుత్ సంస్కరణల పేరుతో అప్పటి టిడిపి ప్రభుత్వం చేసిన నిర్ణయం ప్రజలతోవెనక్కి తగ్గింది. కానీ నేటి వైసీపీ ప్రభుత్వం విద్యుత్ రెగ్యులార్టీ కమిటీ నిర్ణయం అంటూ ఆగస్టు నెల విద్యుత్ వినియోగంపై గుట్టుచప్పుడు కాకుండా యూనిట్ కి 1.23 పైసా చొప్పున అదనపు చార్జీలు వేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.