Andhra PradeshVisakhapatnam
రాష్ట్రంలో గులాబ్ తుఫాను బీభత్సానికి అతలాకుతలం అయిన రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి చైర్పర్సన్ ముత్యాల రాముడు విజ్ఞప్తి

రాష్ట్రంలో గులాబ్ తుఫాను బీభత్సానికి అతలాకుతలం అయిన రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి చైర్పర్సన్ ముత్యాల రాముడు విజ్ఞప్తి
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
గులాబ్ తుఫాను అతి భారీ వర్షాలతో పాటు, తీవ్రమైన గాలుల వల్ల ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం పల్లపు ఆనందపురం గ్రామంలో రైతులు పంట పొలాలు నష్టపోవడం జరిగింది. ఎవరు పంట పొలాలు కోల్పోయారో అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని ముత్యాల రాముడు సూచించారు.పంట నష్టం జరిగినా రైతు కుటుంబాలు ఆర్ధికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉందని, అందువలన ఎలమంచిలి నియోజకవర్గ శాసనసభ సభ్యులు కన్నబాబు , స్థానిక రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి జిల్లాలో ఉండే ప్రతీ మండలంలో ప్రమాదాన్ని పరిశీలించి ఆయా కుటుంబాలను ఆదుకోవాలని ముత్యాల రాముడు కోరారు.