Andhra PradeshUncategorizedVisakhapatnam
రామ నామస్మరణ తో మారు మ్రోగిన తెలగా పాలెం.

రామ నామస్మరణ తో మారు మ్రోగిన తెలగా పాలెం.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
జామి—- విజయనగరం.— కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జామి మండలం లోని పలు శివాలయాల్లో శివనామ స్మరణతో మారుమ్రోగాయి. గురువారం రాత్రి గురుపౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయాలు కిటకిటలాడాయి. భీమసింగి పంచాయతీ తెలగా పాలెం, సోమయాజుల పాలెం. రామాలయాలు, గంగాదేవి ఆలయంలోనూ రామ కీర్తనలతో రామనామ స్మరణతో ఆలయాలు హోరెత్తాయి. తెల్లగా పాలెంలో ప్రతి ఏటా పౌర్ణమికి మానం వారి దేవుడి ఇంటివద్ద సాంప్రదాయ బద్ధంగా జరిగే రామ భజన లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని శ్రీరామచంద్రునికి ప్రత్యేక పూజలు చేశారు. భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని పౌర్ణమి సందర్భంగా వారి మొక్కులు తీర్చుకునే శ్రీరాముడికి అరటి పళ్ళ గెలలు కట్టారు. చెక్కభజన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. చెక్కభజన ముఖ్యకళాకారులు గుల్లి పిల్లి ప్రసాద్, గజ్జి సత్యం మానం శ్రీను, తదితరులు భజన బృందం, పాల్గొన్నారు.
