Andhra PradeshPolitics

రాజధాని అమరావతిలోనే ఉండాలి: సోమువీర్రాజు

అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలని, ఇందులో మరో ఆలోచన లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. రాజధానిలో జరిగే అభివృద్ధి అంతా ప్రధాని మోదీ చేయిస్తున్నదేనని, రాష్ట్ర ప్రభుత్వం రాజధానులు మార్చినా కేంద్ర సంస్థలు అమరావతిలోనే ఉంటాయని ఆయన అన్నారు. తుళ్లూరులో భారతీయ కిసాన్‌ సంఘ్‌ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతిలో అద్భుత రాజధానిని భాజపా నిర్మించి ఇస్తుందని అన్నారు. ప్రధాని మోదీ ప్రతినిధిగా హామీ ఇస్తున్నానని ఆయన చెప్పారు. అమరావతి రైతులకు ఇచ్చిన ప్లాట్లన్నింటినీ రూ. 2 వేల కోట్లతో భాజపా అభివృద్ధి చేస్తుందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే రాష్ట్రంలోనూ భాజపాను గెలిపించాలని కోరారు. ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరులో డిఫెన్స్‌ అకాడమీ నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా వీర్రాజు గుర్తు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: Content is protected !!
%d bloggers like this: