రహదారులు, డ్రైనేజీలు పరిశీలించిన: కార్పోరేటర్
రహదారులు, డ్రైనేజీలు పరిశీలించిన: కార్పోరేటర్
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
మధురవాడ జీవీఎంసీ పరిధిలోని ఆరవ వార్డు ఆదర్శ అవార్డుగా తీర్చిదిద్దుతా అని వార్డ్ కార్పొరేటర్ డాక్టర్ ప్రియాంక అన్నారు. మధురవాడ జోన్లోని ఆరో వార్డు లో వార్డ్ కార్పొరేటర్ డాక్టర్ ముత్తంశెట్టి ప్రియాంక గురువారం పర్యటించారు. పీఎం పాలెం హౌసింగ్ బోర్డు కాలనీలోని మాల తంబ స్కూల్ నుండి ఇ సాంకేతిక ఇంజినీరింగ్ కళాశాల గేట్ వరకు రహదారులు డ్రైనేజీలు పరిశీలించారు. ఎప్పుడో గత పంచాయతీ హయాంలో నిర్మాణం చేపట్టిన రోడ్లు గుంతల మయం వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండి పాదచారులకు వాహనచోదకులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఈ విషయాన్ని వార్డు కార్పొరేటర్ ప్రియాంక దృష్టికి తీసుకువెళ్లగా ఆవిడ స్పందించి ఆ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తోపాటు ఉ ఓపెన్ డ్రైన్స్ కూడా ఏర్పాటు చేసి ఇ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా దోమల నివారణకు శానిటేషన్ పనులను చేపట్టాలని అని జోనల్ కమిషనర్ ను కోరారు.రోడ్ లను సైతం రిపేరు చేసి ఇ ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పీఎం పాలెం లాస్ట్ బస్ స్టాప్ సమీపంలో ఉన్న బీటు కాలనీలో ఆమె పర్యటించి అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు త్రాగునీరు డ్రైనేజ్ నీటిని ఎక్కడ నిలిచి పోకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఇక్కడ ఉన్న ఇల్లు వర్షాలకు కారిపోతున్నాయి వాటి వల్ల ఇబ్బంది పడుతున్నామని కార్పొరేటర్ ప్రియాంక దృష్టికి అక్కడి ప్రజలు తీసుకు వెళ్లారు. అలానే త్రాగునీరు ప్రతి ఒక్కరికీ అందేలా 15 రోజుల్లో ఇంటింటికి కుళాయి ఇవ్వాలని వాటర్ వర్క్స్ అధికారులను కోరారు. అలాగే ఇక్కడ ప్రజల అవసరాల దృష్ట్యా బ్లాక్ లో మధ్యలో ఉన్న కామన్ స్థలాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి అని అధికారులు కూడా పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తూ జీవీఎంసీ ఆరో వార్డు పరిధిలో ఇప్పటికే రెండు కోట్ల రూపాయల స్పెషల్ గ్రాండ్ వచ్చిందని సౌండ్ సౌండ్ లేఔట్ భగవాన్ దాస్ కాలనీలలో డ్రైనేజీ అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు . ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జోనల్ కమిషనర్ బి రాము వాటర్ వర్క్స్ ఈ శ్రీ హరి టౌన్ ప్లానింగ్ టి పి ఓ ప్రసాద్ వార్డు వైసిపి అధ్యక్షులు అప్పలరాజు సీనియర్ నాయకులు గాదె రోసి రెడ్డి పోతిన ప్రసాద్ పోతిన ఎల్లాజీ వీ నర్సింగరావు గుంటు పోయిన సంజీవ్ ఎస్సీ నాయకులు సియ్యాద్రి కనకరాజు శివ మంగ వేణి శానిటరీ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు