రక్షక భటులపై నమ్మకం కోల్పోతున్న ప్రజలు❓️❓️❓️

రక్షక భటులపై నమ్మకం కోల్పోతున్న ప్రజలు❓️❓️❓️
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి.
చిరు వ్యాపారుల దుకాణాలను కొల్లగొడుతున్న దొంగలు.
దొంగతనాలు జరుగుతున్న పిర్యాదులు ఇవ్వని బాధితులు.
వివరాలు
జోన్ 2:మితిలాపురి ఉడా కాలనీ, మధురవాడ,సోమవారం రాత్రి ఒక చరవాణి దుకాణం (మొబైల్ షాప్ ), మూడు కిల్లీ దుకాణలు కొల్ల గొట్టారని దుకాణ దారులు చెపుతున్నారు. అదే ఏరియాలో పలు మార్లు దుకాణాలు దొంగతనానికి గురయ్యాయని, పలు మార్లు ఫిర్యాదులు చేశామని దొంగలను పట్టుకొని కొంత మేరకు నష్టపరిహారం ఇప్పించి వారిని వదిలేయటంతో రెండు మూడు నెలలు గడిచిన తరువాత ఇటువంటి దొంగతనాలు పునరావృత మవుతున్నాయని,నిత్యం మాదక ద్రవ్యాలకు, మత్తుకు బానిసలుగా అలవాటు పడ్డవారే దొంగతనాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు చేస్తే విచారణ కు ఉన్న వ్యాపారం వదులుకుని పోలీసులు చుట్టూ తిరగలేక,వ్యాపారలను రోజు వారి వడ్డీలకు రుసుము తీసుకొని కుటుంభ పోషణ కు చిరు వ్యాపారాలు చేసుకుంటుంటే ఇటువంటి దొంగతనాలు క్రమంగా జరుగుతున్న పోలీసులు వారిని కట్టడి చెయ్యటంలో విఫలమయ్యారని,చిరు వ్యాపార దుకాణ దారులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జరిగిన దొంగతనాలలో చరవాణి దుకాణ దారుడు ఎక్కువగా నష్టపోయారని, కిల్లీ దుకాణాలలో చిల్లర నగదు, సిగరెట్ పాకెట్లను ఎత్తుకుపోయారని దుకాణదారులు తెలిపారు. పోతినమల్లయ్యపాలెం పోలీసులు విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి వచ్చి స్థానికులను నుండి ఆ ఏరియాలో సీసీ కెమెరాల సమాచారాన్ని సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.