మీసేవ ఆపరేటర్లను ఆదుకోవాలి – ఉత్తరాంధ్ర పట్టభద్రులు మాధవ్ కి విజ్ఞప్తి

మీసేవ ఆపరేటర్లను ఆదుకోవాలి – ఉత్తరాంధ్ర పట్టభద్రులు మాధవ్ కి విజ్ఞప్తి
క్యాపిటల్ వాయిస్, విశాఖపట్నం :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీసేవ ఆపరేటర్ల అసోసియేషన్ సభ్యులు శ్రీవత్సవ్, అంజన్, ఆదేశాలతో ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల మీసేవ యూనియన్ సభ్యులు ఆదివారం ఉత్తరాంధ్ర పట్టభద్రులు పి వి ఎన్ మాధవ్ తో సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మీసేవ వ్యవస్థ పై వ్యవహరిస్తున్న తీరు వల్ల 11000 మీసేవ కుటుంబాలు మీసేవ లో పనిచేస్తున్న వారి కుటుంబాలు జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని, గతం లో మీసేవ సర్వీసులు, సచివాలయం లో యధావిధిగా ప్రజలకు ఎక్కడ వీలైతే అక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి క్రమంగా మీసేవలో సర్వీసులు తగ్గిస్తూ, మీసేవ లో దరఖాస్తు చేసుకుంటే సర్టిఫికెట్ చెల్లదని, సచివాలయం లో దరఖాస్తు చేసుకోవాలి అని ప్రజలను భయపెడుతూ అయోమయంలో కి నెట్టారని అందువలన మీ సేవకు ప్రజలు రావడం మానేశారని, కావున మీసేవ ఆపరేటర్లను ఆదుకోవాలని సచివాలయం లో సర్వీసులు మీసేవ లో సమాంతరంగా అయ్యే విధంగా తమరు ప్రభుత్వం తో మాట్లాడాలని, రానున్న చట్టసభ సమావేశాలలో మీసేవ ఆపరేటర్ల సమస్య పై ప్రశ్నించి మీసేవ సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఆపరేటర్లకు న్యాయం చెయ్యాలని కోరారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర పట్టభద్రులు మీసేవ ఆపరేటర్లతో సానుకూలంగా స్పందించి ఆపరేటర్లతో మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ సమావేశాలలో మీసేవ ఆపరేటర్ల సమస్య పై మాట్లాడి సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నిస్తానని తెలిపారని మీసేవ యూనియన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగు,శ్రీహరి, అప్పల నాయుడు,నగేష్, భవాని, తదితర మీసేవ ఆపరేటర్లు పాల్గొన్నారు.