మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు పై దాడి సిగ్గుమాలిన చర్య..!టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు
మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు పై దాడి సిగ్గుమాలిన చర్య..!టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రాభివృద్ధి కోసం విశిష్ట సేవలందించిన తెలుగుదేశం పార్టీ అధినేతపై వైసీపీ గూండాలు చేసిన దాడి సిగ్గుమాలిన చర్య అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు ఆవేదన వ్యక్తం చేశారు.భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రశాంతతకు మారుపేరు తెలుగు రాష్ట్రాలని, అలాంటి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని దుయ్యబట్టారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసి, జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యురిటి ఉన్న నారా చంద్రబాబునాయుడుపైనే ఈవిధంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడిచేసి బయపెడితే, ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని గంటా నూకరాజు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత వైసీపీ అల్లరి మూకల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోయిందని అన్నారు. ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం, బాధితులను పరామర్శకు వెళితే నిర్బంధించడం, కారణం ఉన్నా లేకపోయినా కేసులు పెట్టి బయపెట్టడం చేయడం తప్పా ఈ వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు. స్వయానా మాజీ ముఖ్యమంత్రిపైనే దాడిచేస్తే, దాడికి కారణం అయిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం ప్రభుత్వ దుస్సాహంకారానికి ప్రతీక అని అన్నారు. నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో చాలా కట్టుదిట్టంగా ఉండేవని, అందుకే అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 3వేల కిలోమీటర్లు పైగా పాదయాత్ర ఎక్కడా ఎటువంటి ఆటంకం లేకుండా చేశారని అన్నారు. కానీ ఇప్పటి జగన్మోహన్ రెడ్డి లానే నాడు చంద్రబాబు నాయుడు అనుకొని ఉంటే ఒక్క అడుగు కూడా పాదయాత్ర చేసి ఉండేవారు కాదని అన్నారు. ప్రజా స్వామ్య విలువలను కాపాడుతూ పాలన చేయాలి గాని నిరంకుసత్వంగా పాలన చేయకూడదని గంటా నూకరాజు హితవు పలికారు. రాష్ట్రం సంతోశాంద్ర ప్రదేశ్ గా ఉండాలి గాని సామాన్యులు భయపడే విధంగా ఉండకూడదని అన్నారు.