మహిళలను గౌరవించడం చేతకాని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైస్సార్సీపీ ప్రభుత్వమే అన్న భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు.

మహిళలను గౌరవించడం చేతకాని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైస్సార్సీపీ ప్రభుత్వమే భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో శుక్రవారం చోటుచేసుకున్న పరిణామాలతో యావత్ మహిళా లోకం సిగ్గుతో తలదించుకుందని కోరాడ రాజబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి దేవిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంచార్జ్ కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు, నల్ల దుస్తులు ధరించి కొమ్మాది జంక్షన్ నుండి జీవీఎంసీ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి ధర్నా చేయడమైనది. 5,7,డివిజన్ల కార్పోరేటర్స్ మొల్లి,హేమలత, పిళ్ళా. మంగమ్మ,5,6,7, డివిజన్ల నాయకులు పిళ్ళా. నరసింగరావు, పిళ్ళా. వెంకటరావు, నాగోతి. వెంకట సత్యనారాయణ ,ఈగల. రవి కుమార్, వాండ్రాసి . అప్పలరాజు,టీడీపీ కోర్ కమిటీ మెంబెర్ గొల్లంగి ఆనంద్ బాబు, నాగోతి. సూర్యప్రకాష్, కనూరి. అచ్యుతరావు, మరియు టి ఎన్ టి యూ సి రాష్ట్ర నాయకులు నాగోతి. శివాజీ మరియు మహిళ నాయకురాలు బోయి. రమాదేవి,గోడి అరుణ మరియు మహిళ నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.