మహిళకు జరిగిన అవమానం కొరకు జరిగిన నిరసనలో మరో మహిళా వార్డు అధ్యక్షురాలకు అవమానం.

మహిళకు జరిగిన అవమానం కొరకు జరిగిన నిరసనలో మరో మహిళా వార్డు అధ్యక్షురాలకు అవమానం.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
మధురవాడ జివిఎంసి జోన్ టు పరిధిలోని 5 , 7 డివిజన్ కార్పోరేటర్స్, మరియు నాయకులు, కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఆదివారం కొమ్మాది లో జరిగిన టిడిపి నేతల నిరసన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా నాయకురాలు వార్డు మహిళా అధ్యక్షురాలు పై దౌర్జన్యం చూపిస్తున్నారు . రాష్ట్ర మహిళా నాయకురాలకు మొదటి స్థానం ఇవ్వాలని వార్డు స్థాయి మహిళలు వెనుక ఉండాలని కోపంతో మాట్లాడుతున్నారు..దీని పై వార్డు మహిళలు మాట్లాడుతూ వార్డు లో కార్యక్రమాలకు డివిజన్ మహిళలను దూరంగా వెనుక నిలబడండి అనడం కరెక్ట్ కాదని రాష్ట్రంలోని ,జిల్లాలోని,జరిగే కార్యక్రమాల్లో వారు పాల్గొంటారు అలాగే వార్డు లో జరిగిన కార్యక్రమాల్లో కూడా వారే పాల్గొంటే డివిజన్లో ఉన్న మహిళలు ఎప్పుడు పాల్గొనాలి ? అలాంటప్పుడు డివిజన్ మహిళలను ఎందుకు పిలవడం రాష్ట్రంలోని వారే జిల్లాలోని వారే వార్డు లో కూడా వారే కార్యక్రమంలో పాల్గొనే టప్పుడు డివిజన్లో ఉన్న మహిళలను ఎందుకు పిలిచి అవమానించడం అని బాధతో తెలియజేశారు….