Health

మనం ఉపయోగించే మాస్క్‌ మంచిదేనా?

సింగపూర్: కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి ఉపయోగించే మాస్క్‌ తయారీలో వాడే పదార్థాలు, దాని రూపకల్పన, పొడవు తదితర అంశాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయని పరిశోధకులు నొక్కి చెబుతున్నారు. ‘‘ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్’’ పేరిట ప్రచురితమైన జర్నల్‌లో వైద్య నిపుణులు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఫేస్ మాస్క్‌లు, వాటి ఉపయోగం గురించి చేసిన పరిశోధనల ఆధారంగా.. మాస్క్‌ డిజైన్‌లలో కూడా పలు సమస్యలు ఉన్నాయని, వాటిలో మార్పు చేయగలిగితే సత్ఫలితాలు పొందవచ్చని గ్రహించినట్లు పేర్కొన్నారు. ఫేస్ మాస్క్‌లు వైరస్‌ను ఫిల్టర్ చేయడం, దాన్ని నిరోధించే విధానం గురించి అధ్యయనం చేసినట్లు తెలిపారు. ఈ బృందంలో భారతీయ సంతతికి చెందిన ఒక శాస్త్రవేత్త కూడా ఉన్నారు.

“వైద్య సిబ్బంది ఉపయోగించే(శస్త్ర చికిత్స సమయంలో) సర్జికల్‌ మాస్కుల వినియోగం సమర్థవంతంగా కరోనా వ్యాప్తిని అరికట్టగలదు. సాధారణ ప్రజలు కూడా వీటిని విరివిగా ఉపయోగించాలి. కనీసం 70 శాతం మంది ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఇటువంటి మాస్క్‌లను ఉపయోగిస్తే మహమ్మారిని నిర్మూలించవచ్చు. అంతేకాదు.. సాధారణ వస్త్రాలతో తయారు చేసిన మాస్కులను తరచుగా ధరించడం ద్వారా కూడా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయవచ్చు’’ అని సింగపూర్ విశ్వవిద్యాలయానికి చెందిన వైద్య నిపుణుడు సంజయ్ కుమార్ అన్నారు. వైరస్‌ లక్షణాలు ఉన్న వ్యక్తి తుమ్మినపుడు లేదా దగ్గినపుడు అతడి నోటి నుంచి వెలువడే నీటి తుంపరలు మనపై పడకుండా మాస్కు అడ్డుకుంటుంది. అంతేకాదు గాలిలోని అనేకానేక సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశించకుండా ఆపేస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
%d bloggers like this: