మధురవాడలో ఘనంగా కామ్రేడ్ పోతిన 37 వ వర్ధంతి
మధురవాడలో ఘనంగా కామ్రేడ్ పోతిన 37 వ వర్ధంతి
కమ్యూనిస్టు పార్టీ నాయకులు, మాజీ శాసనసభ్యుడు పోతిన సన్యాసిరావు గారి 37 వ వర్ధంతిని గురువారం సీపీఐ, క్వారీ సొసైటీ సంయుక్తంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఐ విశాఖ నగర కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు మాట్లాడుతూ సన్యాసిరావు రెండు పర్యాయాలు శాసనసభ్యుడుగా పనిచేసారని నిత్యం పేద మధ్యతరగతి ప్రజల కోసం రోడ్లు, విద్య, వైద్య మొదలైన మౌలిక సదుపాయాలు కోసం కృషిచేసారని ముఖ్యంగా మధురవాడలో సహకార రంగంలో క్వారీ సొసైటీని స్థాపించి వందలాది కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మంది కి ఉపాధి కలగడానికి విభజన ఆంద్రప్రదేశ్ లో పేరు తెచ్చుకున్న జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటుకు కృషి చేశారని నివాళులర్పించారు.రాష్ట్ర నగరాల సంక్షేమ సంఘం చైర్మన్ పిళ్ల సుజాత సత్యనారాయణ మాట్లాడుతూ సన్యాసిరావు గారి ఆశయాలు సాధన కోసం మనందరం కృషి చేయాలని అప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మధురవాడ క్వారీ సొసైటీ అధ్యక్ష కార్యదర్సులు పిళ్ల రాంబాబు, వాండ్రసి రవికుమార్ పాలకవర్గం సభ్యులు, టీడీపీ నాయకులు నాగోతి సూర్య ప్రకాష్, పిళ్ల రాంబాబు, పోతిన ప్రసాద్, సీపీఎం పార్టీ నాయకులు డి అప్పలరాజు, రాజకుమార్, సీపీఐ నాయకులు ఎం డి బేగం, కె మేఘారావు, వి సత్యనారాయణ తదితరులతో పాటు పలు రాజకీయ పార్టీలనాయకులు క్వారీ కార్మికులు, సన్యాసిరావు అభిమానులు పాల్గొన్నారు.