Andhra PradeshVisakhapatnam
మంత్రిని కలిసిన చంద్రంపాలెం హైస్కూల్ కమిటీ చైర్మన్

మంత్రిని కలిసిన చంద్రంపాలెం హైస్కూల్ కమిటీ చైర్మన్
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
పాఠశాల అభివృద్ధి కొరకు నిర్వహించిన తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలలో గెలుపొందిన సభ్యులు శుక్రవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నూతనంగా ఎన్నికైన మధురవాడ చంద్రంపాలెం జిల్లా పరిషత్ కమిటీని అలాగే చైర్పర్సన్ బుడుమూరు మీనా మరియు వైస్ చైర్ పర్సన్ పోలినాయుడు లను అభినందించారు అనంతరం మంత్రి అవంతి మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కమిటీలు పాఠశాల అభివృద్ధి కు కృషి చేసేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో ఆశయాలతో పాఠశాలను అభివృద్ధి చేస్తున్నారని అందులో మీరు కూడా భాగం కావాలని అన్నారు, పాఠశాల అభివృద్ధి మీ భుజాల పైనే ఉందని అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని మంత్రి సూచించారు కలిసిన వారిలో సూచించారు. మంత్రిని కలిసిన వారిలో ఆరవ వార్డు ప్రెసిడెంట్ బొట్టు అప్పల రాజు, ఈ ఎన్ ఎస్ చంద్ర రావు, భోజన ప్రసాద్ , బాజీ , మరియు తదితరులు పాల్గొన్నారు.
