Uncategorized

భాగ్యనగరం కన్నీటి సాగరాన్ని తలపిస్తోంది.

కొద్దిరోజులుగా రాజధానిని ముంపు వీడటం లేదు. వందల కాలనీలతో మొదలైన వరద సమస్య వేలాది కాలనీలకు విస్తరిస్తోంది. తగ్గిందనుకునేలోపే మళ్లీ మళ్లీ భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నిన్న ఈరోజు ఉదయం మరోమారు నగరంలో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురిసింది. రాత్రి పదిగంటల తర్వాత కొద్దిసేపు వాన కురవడంతో అబిడ్స్ , కోఠి, అంబర్ పెట్, నల్లకుంట,సహా పలుప్రాంతాలు జలమయమయ్యాయి. గరిష్ఠంగా ఉప్పల్ బండ్లగూడలో 5.08 సెం.మీ. వర్షం కురిసింది. బడంగ్ పేట, మీర్ పేట కార్పొరేషన్ల పరిధిలోని అనేక కాలనీలు రెండు నెలలకుపైగా ముంపులో ఉండగా.. నగరంలోని పలు ప్రాంతాలు పది రోజులుగా తడిసి ముద్దవుతున్నాయి.శివారు ప్రాంతాల నుంచి వరదతోపాటు ప్రధాన నగరంలో కురుస్తున్న వర్షం కూకట్ పల్లి, అల్వాల్, హయత్ నగర్, సరూర్ నగర్ , చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్ , మెహిదీపట్నం మధ్యనున్న ప్రాంతాలను అంధకారంలోకి నెట్టింది. కొన్ని కాలనీల్లో సోమవారానికి వరద కాస్త తగ్గుముఖం పట్టినా మంగళవారం వానతో మళ్లీ పెరిగింది. సొంతిళ్లు ఉన్నప్పటికీ రెండు వారాలుగా దాహం, ఆకలి, కాలకృత్యాలు తీర్చుకునేందుకు అవస్థలు పడుతున్నామని కొన్ని కాలనీల్లో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పునరావాస కేంద్రాల్లో అరకొర వసతులపై జనం ఆగ్రహంగా ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
%d bloggers like this: