Andhra Pradesh

ప్రశ్నపత్రాల్లో మార్పులకు ఇంటర్‌బోర్డు కసరత్తు

హైదరాబాద్‌: కరోనా పరిస్థితుల్లో పరీక్షల విధానంలో పలు మార్పులు చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది. ప్రశ్నల్లో ఛాయిస్ పెంచాలని బోర్డు నిర్ణయించింది. మొదటి, రెండో సంవత్సరం పరీక్షల్లో అతిస్వల్ప, స్వల్ప, దీర్ఘసమాధానాల కేటగిరీల్లో ఛాయిస్‌లను పెంచనున్నారు. ఇప్పటి వరకు అతిస్వల్ప సమాధానాల ప్రశ్నల్లో ఛాయిస్ ఇవ్వడం లేదు. రానున్న పరీక్షల్లో అతిస్వల్ప సమాధానాల ప్రశ్నల్లోనూ ఛాయిస్ ఇవ్వడంతో పాటు.. మిగతా విభాగాల్లో మరిన్ని పెంచాలని నిర్ణయించారు. అయితే ఏయే కేటగిరీల్లో ఎన్ని ప్రశ్నలు ఛాయిస్ ఇవ్వాలనే అంశంపై కసరత్తు జరుగుతోంది. మొదటి, రెండో సంవత్సరంలో 30 శాతం సిలబస్‌ను ఇప్పటికే తొలగించారు. సీబీఎస్ఈ పరీక్షల కంటే ముందే ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే ఏప్రిల్ నెలాఖరులో పరీక్షలు జరపాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. పరీక్షల ఫీజుల తేదీలను రెండు, మూడు రోజుల్లో ఖరారు చేయనున్నారు. ఆన్‌లైన్‌, టీవీల ద్వారా పాఠాలు బోధిస్తున్న ఇంటర్ బోర్డు.. ప్రత్యక్ష తరగతులు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం అనుమతిస్తే సంక్రాంతి తర్వాత భౌతిక తరగతులు ప్రారంభించేలా బోధన, బోధనేతర సిబ్బందిని ఇంటర్ బోర్డు సిద్ధం చేసింది. మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు షిఫ్టు పద్ధతిలో లేదా రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలని భావిస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
%d bloggers like this: