ప్రజాసమస్యలకు ప్రాధాన్యత లేని జివిఎంసి కౌన్సిల్ కుక్కల పార్క్‌ల పేర నిధుల దుర్వినియోగం
ప్రజాసమస్యలకు ప్రాధాన్యత లేని జివిఎంసి కౌన్సిల్ కుక్కల పార్క్‌ల పేర నిధుల దుర్వినియోగం
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
ప్రజాసమస్యలకు ప్రాధాన్యత లేని జివిఎంసి కౌన్సిల్
కుక్కల పార్క్‌ల పేర నిధుల దుర్వినియోగం
90 వార్డుల్లో ఒక్క అభివృద్ది పని చేపట్టని జివిఎంసి.
జిల్లాలో అభివృద్ది సమీక్ష పేర జివిఎంసి కౌన్సిల్ పై పెత్తనం.
స్మార్ట్‌సిటీ భారం జివిఎంసి మీద వేయడం అన్యాయం
సెప్టెంబర్ 18న జివిఎంసి కౌన్సిల్ సమావేశం జరగబోతున్నది. ప్రజలు తక్షణం ఎదుర్కొంటున్న సమస్యలును విస్మరించి ధీమ్ పార్క్‌ల అభివృద్ధే అత్యవసరంగా పార్క్‌ల కొరకు 12.71 కోట్లు నిధులు ప్రతిపాదన చేయటం సమంజసమైనది కాదు. యిందులో 95వ వార్డులో కుక్కల కోసం ధీమ్ పార్క్‌ను అభివృద్ది కొరకు 194 లక్షలు ప్రతిపాదనలు చేశారు. ధీమ్ పార్క్‌లు, రెయిన్‌బో, స్నేక్, మెడిటేషన్, గార్డెన్స్‌ధీమ్, చీతాకోకచిలుక ధీమ్ పార్క్‌ల పౌర నిధులను ప్రతిపాదించటంలో ఎటువంటి హేతుబద్దత, సమగ్ర దృష్టి లేదు.
– జివిఎంసిలో రోడ్లు అన్నీ పాడైపోయి ప్రజలు తీవ్ర యిబ్బందులు పడుతున్నారు. కార్పొరేటర్లు వాళ్ళ వార్డుల్లోని సమస్యల పరిష్కారం కొరకు అనేక విజ్ఞాపనలు యిచ్చారు. గత నాలుగు నెలల నుండి ఏ ఒక్క దానికి నిధుల ప్రతిపాదన చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు.
– గడిచిన 4నెలల్లో 90 వార్డుల్లో ఏ ఒక్కొ అభివృద్ది కార్యక్రమానికి జివిఎంసి నిధులు కేటాయించలేదు. పై పెచ్చు మంత్రిగారి కుమార్తె అని ‘‘6’’ వ వార్డుకి యిప్పటి కౌన్సిల్ ప్రతిపాదనలుతో కలిపి సుమారు 7 కోట్లు మంజూరు చేశారు. 18వ తీదీ కౌన్సిల్లో 3.87 కోట్లు విలువ కలిగిన రెండు పార్క్‌ల అభివృద్దికి నిధుల ప్రతిపాదనలు చేశారు. 90 వార్డుల ప్రజలను నిర్లక్ష్యం చేయడమే.
– రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులను జివిఎంసి మీద భారం వేయటాన్ని సిపిఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. 2015`19 మధ్య కాలంలో ఎసి సబ్ ప్లాన్ క్రింద జివిఎంసి పరిధిలో చేపట్టిన పనులకు 40.69 కోట్లు జివిఎంసి చెల్లించాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ఇదే ప్రతిపాదనను కౌన్సిల్ ముందు ప్రతిపాదించారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.
– స్మార్ట్‌సిటీలో భాగంగా చేపట్టిన పనుల్లో 20 శాతం ఖర్చును అనగా ప్రస్తుతం 13 కోట్లు బదిలీ చేయాలని జివిఎంసి ఎజెండాల్లో ప్రభుత్వ ఆదేశాలతో ప్రతిపాదించారు. ఈ నిధులను రాష్ట్రప్రభుత్వం భరించాలి. స్మార్ట్‌సిటీ అనేది మొత్తం నిరర్ధక ప్రాజెక్టు. అవినీతిమయం. ప్రజలకు ఉపయోగం లేనిది. దీనిని సిపిఐ(ఎం) ఖండిస్తున్నది.
– జివిఎంసి కౌన్సిల్ పైవారి ఆదేశాలతో నడిచే దుస్థితికి దిగజారుస్తున్నారు. అభివృద్ది సమీక్షా సమావేశాల పేరు మంత్రులు, ఎంపిలు, మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ ప్రధానకార్యదర్శి కె.కె.రాజు వంటి వారు ప్రతిపాదించే వాటి కోసమే జివిఎంసి కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వారు ప్రతిపాదించిన పనులే ఆమోదం జరుగుచున్నది. ఈ చర్య 74వ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నది. కార్పొరేటర్లు, మేయర్‌ను ఉత్సవ విగ్రహాలుగా మార్చేస్తున్నారు. ఈ తీరు ప్రజలు వ్యతిరేకించాలని సిపిఐ(ఎం) విజ్ఞప్తి చేస్తున్నది. డా. బి గంగారావు 78వ్వార్డ్ కార్పరేటర్, cpm నగర కార్యదర్శి.