Andhra PradeshVisakhapatnam
పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతి పిత మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలు.

పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతి పిత మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జాతి పిత మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమం, మధురవాడ మార్కెట్ వద్ద, సంఘ అధ్యక్షులు నాగోతి సూర్యప్రకాష్ అధ్యక్షతన ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు గాంధీజీ గొప్పతనం గురించి, స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పాత్ర గురించి, దేశ ప్రజలకి ఆయన ఇచ్చే సందేశం గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలోకార్యనిర్వాహక అధ్యక్షులు వంటాకుల శ్రీనివాసరావు , ప్రధాన కార్యదర్శి చింతాడ మోహన్ రావు, ఉపాధ్యక్షులు నూకవరపు బాబ్జి, బెల్లాపు పాపారావు, సెట్టిపల్లి జగన్ మోహన్ చౌదరి, పోలిశెట్టి నాగేశ్వరరావు, కోశాధికారి మామిడి సతీష్ కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి తాటి తూరి మోహన్ రావు,కార్యదర్శులు పెండ్రి అప్పన్న బాబు, షేక్ కరీమ్, పీ. ఆశాజ్యోతి, మామిడి వరలక్ష్మి, మరియ అనేకమంది స్తానికులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసారు.
