పేరుకే పాఠశాలలో నాడు నేడు-శిథిలావస్థలో పాఠశాలలు గోడు: విశాఖ పార్లమెంటరీ టి.ఎన్.ఎస్.ఎఫ్ అధ్యక్షులు: సాకేల రతన్ కాంత్

పేరుకే పాఠశాలలో నాడు నేడు-శిథిలావస్థలో పాఠశాలలు గోడు: విశాఖ పార్లమెంటరీ టి.ఎన్.ఎస్.ఎఫ్ అధ్యక్షులు సాకేల రతన్ కాంత్
విశాఖపట్నం..గాజువాక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు పేరుతో ప్రజాధనం దోపిడీ కి తెర తీశారని మండిపడ్డ విశాఖ పార్లమెంటరీ టి.ఎన్.ఎస్.ఎఫ్ అధ్యక్షులు సాకేల రతన్ కాంత్..ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అద్వాన్నంగా ఉన్నాయని,విశాఖపట్నం జిల్లాలో మరి ఘోరంగా పాఠశాలలు పరిస్థితి ఉన్నాయని అన్నారు.. గాజువాక మండలం సింహగిరి కాలనీ వద్ద ప్రభుత్వ పాఠశాల వద్ద డ్రైనేజీలో నీరు రోడ్లు మీద పొంగి పొర్లుతున్నాయి, పాఠశాల కాంపౌండ్ గోడ కూలిపోయింది.. అయిన విద్యా శాఖ అధికారులు పట్టించుకోలేదు..ఏ క్షణాన ఏం జరుగుతోందో అని విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ పాఠశాలలు పోతున్న పరిస్థితి.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పేరిట నాడు నేడు పథకం కింద బడ్జెట్లో వేల కోట్లు కేటాయించిన నిధులను పక్కదారి పట్టడం వల్లే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలకు ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శించారు..విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని హితవు పలికారు..మద్యం,మటన్ దుకాణాలు పై ఉన్న శ్రద్ద పాఠశాలలు అభివృద్ధి పై శ్రద్ధ వహించాలని ఎద్దేవా చేశారు..విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాఠశాలలు అభివృద్ధి మీద కాకుండా తన సొంత అభివృద్ధి మీద దృష్టి సరిస్తున్నారని అందుకే అవినీతి ఆరోపణలు కేసులు ఎదుర్కొంటున్నారని దుయ్యబట్టారు..విద్యాశాఖ అధికారులు మేల్కొని శిథిలావస్థలో ఉన్న గాజువాక సింహగిరి ప్రభుత్వ పాఠశాలలు వంటి అన్ని పాఠశాలను సందర్శించి తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని రతన్ కాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..