Andhra PradeshVisakhapatnam
పాఠశాల చైర్మన్ ఎన్నికలు రాజకీయ రంగు పులుముకుంటోందా!?.

పాఠశాల చైర్మన్ ఎన్నికలు రాజకీయ రంగు పులుముకుంటోందా!?.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల ల్లో మంచి పేరు ప్రక్యాతలు సంపాదించిన పాఠశాల, ఇటీవల బి బి సి ఛానల్ లో కూడా పాఠశాల గొప్పతనం కోసం దేశ వ్యాప్తంగా ఒక ప్రభుత్వ పాఠశాల గొప్ప తనం తెలియచేసిన మధురవాడ చంద్రంపాలెం పాఠశాల లో రాజకీయ రంగు పులుముకోవటంతో ప్రశాంతంగా జరగవలసిన విద్యార్థుల తల్లి తండ్రుల ఎన్నికలలో కూడా రాజకీయ నాయకులు ప్రవేశంతో వాడి వేడిగా ఆందోళన చెయ్యటంతో పాఠశాల తల్లి తండ్రుల కమిటీ వాయిదా వేసినట్టు తెలిపారు. అలాగే వాంబే కాలనీ ప్రాధమికొన్నత పాఠశాల కమిటీ ఎన్నికలలో చైర్మన్ గా నీలమ్మ ను ఎన్నుకోగా వైస్ చైర్మన్ గా పెంకి శంకర్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.ఇరువురిని కార్పొరేటర్ పిల్లా మంగమ్మ దంపతులు శాలువా కప్పి అభినందించారు.


