పందుల నిర్ములన స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న జీవీఎంసీ సిబ్బంది పై అధికారపార్టీ అండదండలతో పెంపకం దారులు దాడులు?

పందుల నిర్ములన స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న జీవీఎంసీ సిబ్బంది పై అధికారపార్టీ అండదండలతో పెంపకం దారులు దాడులు!!??
భీమిలి :జోన్ 2, మధురవాడ పరిధిలో జీవీఎంసీ పరిధిలోని పందుల నిర్మూలాన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహణ లో జీవీఎంసీ సిబ్బంది వాహనంలో పందులను పట్టుకునే పనిలో ఉన్న సిబ్బంది పై పందుల పెంపకదారులు పెద్ద సంఖ్యలో జీవీఎంసీ సిబ్బంది పై దాడికి యత్నించ్చారు.అది తెలుసుకున్న సిబ్బంది వారు వాహనంలో తిరిగివెళ్తుండగా పందుల పెంపక దారులు వారి ద్విచక్ర వాహనాలలో జీవీఎంసీ సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేశారు. భయంతో వాహనాలతో పరుగులు తీయటం, చూసి అక్కడ ప్రజలు ఆచార్యాని కలిగించింది.ఆంధ్రప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని స్థానికులు ఆశ్చర్యపడ్డారు. మినిస్టర్ అవంతి శ్రీనివాస్ నియోజకవర్గం లోనే జీవీఎంసీ సిబ్బంది పై ఇంత దాడులకు పాలపడటంపై మినిస్టర్, స్థానిక నాయకుల అండదండలు ఉండటం తోనే దాడికి యత్నించారనే అనుమానం వ్యక్తం అవుతుందని స్థానిక ప్రజలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.జీవీఎంసీ సిబ్బందికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు ఏమి రక్షణ కలిపిస్తారనే స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పందుల పెంపకం చేస్తున్న వారు తరపున నాయకుడు మినిస్టర్ అవంతి అనుచరుడుగా ఉండటం గతంలో కూడా ఇలాంటి దాడులకు వారు పాల్పినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల నాయకులు వారికి వత్తాసు పలుకుతూ సామాన్య ప్రజల సమస్యలను పట్టించుకోవటం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు.పందులు వలన మెదడు వ్యాది వచ్చే అవకాశం ఉన్నందువల్ల అధికారులు, సిబ్బంది సమస్యలపై వారిపనులు చేస్తుంటే వెనుకనుండి ఇటువంటి దాడులు నాయకులే చేయిస్తున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ స్థానిక ప్రజనీకం అధికార పార్టీ నాయకులపై విమర్శలను దుమ్మేత్తి పోస్తున్నారు.