నెల్లూరు నగరం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్స్ పంపిణి

నెల్లూరు నగరం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్స్ పంపిణి
క్యాపిటల్ వాయిస్ జిల్లా ప్రతినిధి, నెల్లూరు :- జనసేన జిల్లా కార్యాలయం లో నెల్లూరు సిటీ లో పూర్తయిన క్రియాశీలక సభ్యత్వ కిట్స్ ను నెల్లూరు జిల్లా కమిటీ సభ్యుల సమక్షం లో క్రియశీలక సభ్యులకు అందజేశారు,ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,ఉపాధ్యక్షులు బద్దెపూడి సుధీర్,సిటీ నాయకులు సుజయ్ బాబు మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు సిటీ లో దాదాపు 1100మంది పై చిలుకు తో పూర్తి చేయటం శుభప్రదం అని,ఈ కార్యక్రమం ఇంతటి విజయం సాధించడానికి జిల్లా అధ్యక్షులు శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి కార్యదక్షతే కారణమనీ తెలిపారు..తన వ్యక్తిగత సంపాదన నుంచి కార్యకర్తల శ్రేయస్సు నిమిత్తం కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిదే అనీ,ఈ సభ్యత్వం తో పాటు సభ్యులకు ఇచ్చిన భీమా సౌకర్యం తో ప్రమాదం జరినపుడు,వైద్యం నిమిత్తం రూ50000లు ప్రాణ హాని జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు రూ 500000 ఇస్తూ పార్టీ తరపున భరోసా కల్పిస్తున్నామనిఘ,దేశం లో మరే రాజకీయ పార్టీల్లో లేని సౌకర్యం జనసేన పార్టీ కలగజేసింది,
రానున్న రోజుల్లో అన్నీ నియోజకవర్గాల్లో క్రియాశీలక సభ్యత్వాలు పూర్తి చేసి బలమైన కమిటీలు ఏర్పరుచుకొని,కరోనా కష్టకాలం లో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజల ఆర్థిక కష్టాలను సైతంలెక్క చేయక పన్నులతో బాదుతూ పీడిస్తున్న ప్రభుత్వం తో పోరాటానికి సామాన్యుడికి అండగా నిలుస్తామనీ తెలిపారు. జిల్లా ప్రధానకార్యదర్శి గునుకుల కిషోర్, నెల్లూరు నగర నాయకులు సుజయ్ బాబు, ఉపాధ్యక్షులు, సుధీర్ బద్దిపూడి, జిల్లా ప్రధాన కార్యదర్శి, మేకల ప్రవీణ్ కుమార్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మున్వర్ భాష, కార్యదర్శి,పసుపర్తి కిషోర్,సంయుక్త కార్యదర్శులు, పూసల లక్ష్మిమల్లేశ్వరరావు, ప్రశాంత్ గౌడ్ లీలా మోహన్, జనసేన పార్టీ నాయకులు సుల్తాన్ బాషా, షాజహాన్, తదితర నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు..