Andhra PradeshVisakhapatnam
దివ్యాంగురాలు నాగ రత్నం ను పరామర్శించిన బిజెపి మహిళా మోర్చా సభ్యులు

దివ్యాంగురాలు నాగ రత్నం ను పరామర్శించిన బిజెపి మహిళా మోర్చా సభ్యులు
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
బుధవారం జరిగిన సీలేరు లో దివ్యాంగురాలు నాగ రత్నం అనే మహిళపై వైసిపి నాయకుడు నాలా వెంకట్రావు అత్యాచారం చేశాడు విశాఖపట్నం కెజిహెచ్ లో బాధితురాలు చికిత్స పొందుతుంది. ఆమెను పరామర్శించడానికి బిజెపి మహిళా మోర్చా సభ్యులు కలవడం జరిగింది. కేజీహెచ్ సూపర్డెంట్ గార్ని కలిసి బాధిత మహిళ గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉమ్మడి సుజాత రాజ్ మాట్లాడుతూ ఒక అధికార పార్టీలో ఉన్న వ్యక్తి ఈ రకంగా ప్రవర్తిస్తే అంటే అధికారం మాది మేము ఏం చేసినా మా రాజ్యం మా ఇష్టం అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి అలానే అధికార పార్టీ నాయకులు కూడా ఇదే రకంగా రౌడీయిజం గా ప్రవర్తిస్తుంటే ప్రజలు ఏమైపోతారు ఒకప్పుడు ఆడపిల్ల పుడితే బరువు అనుకునేవాళ్లు ఈ రోజు ఆడపిల్ల పుడితే ఆ అమ్మాయికి రక్షణ ఇవ్వగలమా ! అనే భయం తో ప్రజలు బతుకుతున్నారు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు పేదవాడికి ఒక రకమైన శిక్ష వెంటనే అమలు జరుగుతుంది. అదే రాజకీయ నాయకులకు బడాబాబులకు ఎన్ని సంవత్సరాలైనా పరిష్కారం కాని సమస్యగా మిగిలిపోతున్నాయి ఏంటి తేడా ప్రభుత్వాలు విధానాలు ఏ రకంగా ఉంటున్నాయి ఒక్కసారి గమనించాలి జగన్ మోహన్ రెడ్డి ఒక్కసారి అధికారంలోకి రావడానికి అక్కమ్మ లు చెల్లెమ్మలు అంటూ ప్రజల్లోకి వచ్చిన జగనన్న చెల్లెళ్లకి కల్పించే రక్షణ ఇదేనా ఒక మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో అత్యాచారాలు సంఖ్య 63 శాతం పైనే జరుగుతున్న పట్టించుకోని మహిళా హోం మంత్రి రోజు రోజుకి మహిళలపై జరిగే దాడులు పెరుగుతూ ఉంటే హోం మంత్రి, మన జగన్ అన్న ఇదేనా మా మహిళలకు మీరిచ్చే రక్షణ అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది. అన్నారు పాదయాత్ర అంటూ ప్రజల మధ్య కి వెళ్తే ఇప్పుడు చెప్తారు మీకు అక్కమ్మ లు చెల్లెమ్మల అనుకొని వెళితే మీకు బుద్ధి బాగా చెప్పారు. అర్ధరాత్రి మహిళను నడిచిన రోజు నిజమైన స్వాతంత్రం వచ్చింది అన్నారు కానీ ఇప్పుడు పట్టపగలు ఆడవాళ్ళ నడవలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వం లో వచ్చింది ఇది వైసీపీ పాలన రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు రోహిణి,మహిళా ప్రధాన కార్యదర్శి సుబ్బలక్ష్మి, వైస్ ప్రెసిడెంట్ పద్మ, సెక్రెటరీ లక్ష్మీ నరసమ్మ వసంత సెక్రటరీ మంజుల, నాగమణి, ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యురాలు మాధవి విజయనగరం ఇంచార్జ్ గిరిజ, ఎస్టి మోర్చా అధ్యక్షులు మోహన్ రావు, మెడికల్ సెల్ కన్వీనర్ రవికుమార్, కేజీహెచ్ ను సందర్శించడం జరిగింది.
