డ్రై డే ఫై డే, సీజనల్ వ్యాధులపై అవగాహన..

డ్రై డే ఫై డే, సీజనల్ వ్యాధులపై అవగాహన..
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
జీవీఎంసీ 22వ వార్డులో శుక్రవారం డ్రై డే ఫ్రై డే కార్యక్రమంతో పాటు సీజనల్ వ్యాధులపై అవగాహన నిర్వహించారు. జీవీఎంసీ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శాస్త్రి, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మంగపురంకాలనీ, తారమసీదు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి సీజనల్ జ్వరాల పై అవగాహన కల్పించారు. వార్డులో డెంగ్యూ కేసులు నమోదు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మెడికల్ సిబ్బందిని ఆదేశించారు. వార్డులో అపరిశుద్ధ్యం ఉండకూడదని, పారిశుద్ధ్యం మెరుగు పర్చాలని శానిటేషన్ అధికారులకు ఆదేశించారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసెల ప్రజలకు అవగాహన కల్పించారు. ఆలాగే డ్రె డే ఫ్రై డే కార్యక్రమంలో భాగంగా ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు ఉండకూడదని నిల్వలు వల్ల దోమలు వ్యాప్తి చెంది జ్వరాల బారిన పడతారని హెచ్చరించారు. అనంతరం దోమల వ్యాప్తి అరికట్టడానికి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్సెపెక్టర్ బంగార్రాజు, సచివాలయ కార్యదర్సులు, పాల్గొన్నారు.