జెండా మోసినోడి ఎక్కడ….?లాఠీ దెబ్బలు తిన్న వాడు ఎక్కడ…? కేసులు అనుభవించినోడు ఎక్కడ…?

జెండా మోసినోడి ఎక్కడ….?లాఠీ దెబ్బలు తిన్న వాడు ఎక్కడ…? కేసులు అనుభవించినోడు ఎక్కడ…?
ఇప్పుడు మేయర్ పదవి ఎవరికి దక్కింది….?
వైసీపీలో ఉన్న సోషియల్ ఇంజనీరీంగ్ ఇదేనా…?
అసలు ఎవరు ఈ వసీం.? ఎప్పుడైనా జెండా మోసాడా.? పార్టీ కోసం నాలుగు అడుగులు
వేసాడా…?
అనంతపురం జిల్లా బ్యూరో, క్యాపిటల్ వాయిస్ :- అనంతపురం మేయర్.. వసీం.
అసలు ఎప్పుడైనా ఈ పేరు విన్నారా.. అసలు ఎప్పుడైనా అతని ఫోటో అయినా
చూశారా.. కానీ ఇప్పుడు అతనే మన మేయర్. అందులోనూ అఖండమైన మెజార్టీతో
గెలిచిన వైసీపీకి ఆయన.. తప్ప ఎవరూ కనిపించలేదా. పార్టీ కోసం 10ఏళ్లుగా
జెండా మోసినోళ్లు వేల సంఖ్యలో ఉన్నారు.. కేసులు, లాఠీ దెబ్బలు,
చీదరింపులు, అవమానాలు ఎదుర్కొన్న వారు ఎంతో మంది ఉన్నారు..మరి ఈ నాయకుల
కళ్లకు వారు కనబడలేదా.లేదా కనిపించి కనిపించనట్టు నటిస్తున్నారా.. ఏంటీ
అన్యాయం.
నిగ్గ దీసి అడగాల్సింది… ప్రజలను కాదు.. ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు..
కానీ నాయకులే సిగ్గుమాలినా.. స్వప్రయోజన, స్వార్థపూరిత అంతకుమించి పదాలను
వాడాల్సి ఉన్నా సంస్కారం అడ్డు వచ్చి వాడలేని పరిస్థితి. అసలు అనంతపురంలో
వేరే నాయకులే లేరా.. అసలు చవ్వా రాజశేఖర్ రెడ్డి ఎన్ని రోజుల నుంచి
పార్టీలో ఉన్నారు… అసలు మహాలక్ష్మీ శ్రీనివాస్ రాజకీయాల కోసం తన సర్వం
దారపోసాడు.. టీడీపీలో మోసానికి గురై.. వైసీపీలోకి వస్తే ఇంతటి అన్యాయమా.
మహాలక్ష్మీ శ్రీనివాస్ 2014 కు ముందు పార్టీలోకి వచ్చాడనకునుందాం.. ఆయన
ఎమ్మెల్యే రేస్ లో ఉన్నా.. పార్టీ అధిష్టానం సూచన మేరకు ఆ సీటు మన
వెంకట్రామిరెడ్డికి వదిలేశారు. ఆ రోజు మేయర్ పదవి పై దాదాపు హామీ ఉన్నా..
ఇప్పుడేందుకు అన్యాయం చేశారు… పార్టీలకు, కులాలకు అతీతంగా ఆయనపై
సానుభూతి ఉన్నా.. అధిష్టానం ఎందుకు కనుకరించలేదు.. పోనీ ఆయన బయటి నుంచి
వచ్చిన వ్యక్తి అనుకుందాం..మరి చవ్వా మొదటి నుంచి వైఎస్ ఫ్యామిలీతోనే
ఉన్నారు కదా… ఆయన ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కానీ మేయర్ అడిగితే ఎందుకు
ఇవ్వలేదు.. వైటీ శివారెడ్డి ఫ్యామిలీకి ఇదే అన్యాయం.. ఆయన కుమారుడికి
కనీసం డిప్యూటీ మేయర్ కూడా ఇవ్వరా.. కొగటం లాంటి బలమైన వ్యక్తులు
కనపడలేదా.. ఇంకా రాగే పరుశురాం లాంటి బీసీలు ఎంతో మంది పార్టీ కోసం పని
చేశారు… కష్టపడ్డారు.. ఆస్తులు పోగోట్టుకున్నారు. అసలు ఎవరు ఈ
వసీం…..ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డికి అత్యంత సన్నిహితుడే ఈ వసీం..
కనీసం ఏరోజైనా జెండా మెసాడా.. కనీసం పార్టీ కార్యక్రమాల్లో
పాల్గొన్నారా.. కనీసం వైసీపీ చేసిన ఏదైనా ఉద్యమంలో పాల్గొన్నాడా.. అదీ
వద్దు ఏరోజైనా పార్టీ కోసం గళం విప్పాడా.. మరి ఎందుకు ఆయనకు మేయర్ పదవి..
ఎమ్మెల్యే అనంతకు సన్నిహితుడనా.. పోనీ ఆ లెక్కే అనుకుంటే.. మిగిలిన
నాయకులంతా పార్టీ జెండా పక్కన పెట్టి వెంకట్రామిరెడ్డి ఇంట్లో పని చేసే
వారు కదా. మైనార్టీ అనే వసీంకు పదవా..ఇవన్నీ పక్కన పెట్టి మైనార్టీ
కోటాలో వసీంకు పదవి ఇచ్చారని అనుకుంటే.. మైనార్టీల్లో ఎంత మంది నాయకులు
లేరు…కార్యకర్తలు లేరు. నదీం అహ్మద్.. చాలా ఏళ్ల నుంచి పార్టీలో
ఉన్నారు.. ఏం ఆయన మేయర్ పదవి ఇస్తానంటే వద్దన్నారా.. మైనార్టీలకే పదవి
అని ఉంటే.. పార్టీలో నదీంకన్నా అర్హులు ఎవరూ లేరు. మరి ఆయనకెందుకు ఈ
విషయం చెప్పలేదు. అసలు వైసీపీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయాన్ని
మైనార్టీలు కూడా హర్షించే పరిస్థితిలో లేరు.