Andhra PradeshVisakhapatnam
జీవీఎంసీ వాటర్ పైపులైను పగిలి నీరు వృధా స్పందించని అధికారులు.???

జీవీఎంసీ వాటర్ పైపులైను పగిలి నీరు వృధా స్పందించని అధికారులు.???
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
భీమిలి జీవీఎంసీ జోన్ టు పోతినమలయ్యపాలెం కార్ షెడ్ జంక్షన్ వద్ద జీవీఎంసీ వాటర్ పైపులైను పగిలిపోయి నీరు వృధాగా పోతుందని స్థానిక దుకాణదారులు ఆవేదన చెందుతున్నారు. ఒక పక్క తుఫాన్ బీభత్సం వల్ల కార్ సైడ్ జంక్షన్ వద్ద మురికి వాటర్ నిలిచిపోవడం తో ఈ పైపులైను వల్ల వచ్చే తాగునీటి వాటర్ కూడా ఆ మురికి నీళ్లులో కలవడంతో అది సేవిస్తున్న ప్రజలు అనారోగ్యం బారిన పడతారని అలాగే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని దుకాణదారులు తెలిపారు.దీనిపై జీవీఎంసీ తాగునీటి అధికారులకు తెలియపరిచిన స్పందించడం లేదని స్థానిక దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి పైపులైను మరమ్మతులు చెయ్యాలని స్థానిక దుకాణదారులు ఉన్నత క అధికారులను కోరారు.
