జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ,రెవెన్యూ విభాగాల అవినీతి పై కౌన్సిల్ లో చర్చించాలి జనసేనపక్షనేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్ మేయర్, కమిషనర్ లకు వినతిపత్రం GVMC TOWN PLANING,REVENUE VIBHAGALA AVINEETHIPAI COUNCIL LO CHARCHINCHALI JANASENAPAKSHANETHA PEETHALA MURTHY YADAV DEMAND MAYOR,COMMISIONERLAKU VINATHIPATRAM
జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ,రెవెన్యూ విభాగాల అవినీతి పై కౌన్సిల్ లో చర్చించాలి
జనసేనపక్షనేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్
మేయర్, కమిషనర్ లకు వినతిపత్రం
జీవీఎంసీ లో టౌన్ ప్లానింగ్ విభాగం, రెవెన్యూ విభాగం అవినీతికి చిరునామాగా మారాయని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ అన్నారు. సెప్టెంబర్ 18వ తేదీన జరిగే జీవీఎంసీ సమావేశంలో ఈ రెండు విభాగాల్లో పేరుకుపోయిన అవినీతి అక్రమాలు, తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలు పై చర్చ ను ఎజెండా లో చేర్చాలి అని విజ్ఞప్తి చేస్తూ జీవీఎంసీ కమీషనర్,మేయర్ లకు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భగా అయన మాట్లాడుతూ పలు సందర్భాల్లో అధికార పార్టీ సభ్యులే ఈ రెండు విభాగాలు పై తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే అని గుర్తు చేసారు. ఈ రెండు విభాగాల కారణంగా నగరపాలక సంస్థ చెడ్డపేరు రావడంతో పాటు వందల కోట్ల అవినీతి, అద్దె బకాయిలతో సకాలంలో పన్నులు చెల్లించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీవీఎంసీ లోని టౌన్ ప్లానింగ్ , రెవెన్యూ విభాగాలు సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు. టౌన్ ప్లానింగ్ ,రెవెన్యూ విభాగం లో మార్పులు, దిద్దుబాటు చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఇప్పటికే ఈ విషయాలు పై ఇప్పటికే జీవీఎంసీ కమీషనర్ కు లేఖలు రాశాను అని తెలిపారు. ఆదాయం లేదన్న సాకుతో విశాఖ నగర ప్రజలపై ఇంటి పన్ను తో పాటు కొత్తగా చెత్త పై పన్ను విధించిన సమయంలో రావాల్సిన అద్దెలను సకాలంలో వసూలు చేయకపోవడం వల్ల సంస్థకు వందల కోట్ల నష్టం వాటిల్లుతుంది అని అన్నారు. కొత్తగా పన్నులు విధించి ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న నగరపాలక సంస్థ కోట్ల రూపాయల అద్దె బకాయిలు వదిలేస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవరిస్తుంటే మరో పక్కకోట్ల రూపాయల టౌన్ ప్లానింగ్ ఆదాయం లంచాల రూపంలో పక్కదారి పడుతుంది అని అన్నారు.