జియో మరో సంచలనానికి సిద్ధం….. రూ.15 వేలకే 4G సిమ్‌తో జియో ల్యాప్‌టాప్!

జియో మరో సంచలనానికి సిద్ధం….. రూ.15 వేలకే 4G సిమ్‌తో జియో ల్యాప్‌టాప్!
జియోబుక్ ల్యాప్‌టాప్ ధర
జియోబుక్ 4జీ ల్యాప్‌టాప్ ధర సుమారు రూ.15,000గా ఉంటుందని రాయిటర్స్ రిపోర్ట్ పేర్కొంది. ఎంట్రీ లెవెల్ స్పెసిఫికేషన్లతో వస్తుందని పేర్కొంది. తక్కువ ధరకే ఈ ల్యాప్‌టాప్ తెచ్చి.. ఆధిపత్యం ప్రదర్శించాలని జియో భావిస్తోంది. జియోఫోన్ విషయంలోనూ ఇదే సూత్రాన్ని పాటించి సక్సెస్ అయింది. జియోఫోన్, జియోఫోన్ నెక్ట్స్ వల్ల జియోకు యూజర్లు గణనీయంగా పెరిగారు.జియోబుక్ ల్యాప్‌టాప్ కోసం క్వాల్‌కామ్‌తో పాటు మైక్రోసాఫ్ట్ తోనూ రిలయన్స్ జియో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాప్ రన్ కానుండగా.. కస్టమైడ్జ్ విండోస్ అపరేటింగ్ సిస్టమ్ ఉండనుంది. 11.6 ఇంచుల డిస్‌ప్లే, 13 గంటల బ్యాటరీ లైఫ్‌తో ఈ ల్యాప్‌టాప్ వస్తోందని సమాచారం. ఈనెలాఖరుకు లేకపోతే నవంబర్ తొలి అర్ధభాగంలో జియోబుక్ ల్యాప్‌టాప్ అందుబాటులోకి రానుందని అంచనాలు వెలువడుతున్నాయి. పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలకు ముందుగా జియో ఈ ల్యాప్‌టాప్‌లను విక్రయిస్తుందని తెలుస్తోంది. మూడునెలల్లో సాధారణ వినియోగదారుల కోసం సేల్‌కు తెస్తుందని అంచనా. అంటే మొత్తానికి 2022 చివరి కల్లా అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.దేశీయంగా జియోబుక్ ల్యాప్‌టాప్‌ను తయారు చేసేందుకు కాంట్రాక్ట్ మానుఫ్యాక్చరర్ ఫ్లెక్స్ (Flex)తో రిలయన్స్ జియో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. 2023 మార్కెట్ కల్లా లక్షలాది ల్యాప్‌టాప్‌లను విక్రయించాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది.