జగనన్న నవరత్నాలు ఎందరికి లాభం ఎందరికి నష్టం లాభం 30%నష్టం 70%… ❓
జగనన్న నవరత్నాలు ఎందరికి లాభం ఎందరికి నష్టం లాభం 30%నష్టం 70%… ❓
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
ప్రజా ధనం దుర్వినియోగం…!
అభివృద్ధి గుండు సున్నా 0…!
ప్రచారం ఖర్చులు రంగులకు వేల కోట్లు…!
ఇంటింటి రేషన్, సన్నబియ్యం పంపిణీ విఫలం…!
రాష్ట్రం మొత్తం రహదారులు గుంతల మయం…!
రాజ్యాంగ బద్ద వ్యవస్థల నిర్వీర్యం. సచివాలయ వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి అధిక నిధుల భారం…!
సచివాలయం రంగులకు వందల కోట్ల దుర్వినియోగం…!
రేషన్ వాహనాలు, సంచులకు వందల కోట్ల దుర్వినియోగం…!
లాభం, ఒకే కుటుంబంలో ఇంట్లో ఆటో వాలా, లేదా టైలర్, లేదా కాపు నేస్తం ఏడాదికి 10000/- 45 ఏళ్ళపైబడి ఉన్న మహిళ కి చేయూత 18500/- అమ్మఒడి లేదా ఫీజు రీయమ్బెర్స్మెంట్ 10000/- 20000/- అందుకున్న కుటుంబాలు 30% లబ్ది పొందితే లబ్ది పొందని కుటుంబాలు 70% పొందానివారే ఉన్నారని ప్రాథమిక అంచనా. ఆటో డ్రైవర్లు కి ఇచ్చే 10000/- కు గత ప్రభుత్వం రహదారుల పన్ను రద్దు చేసినట్టుగా దీనికి బదులుగా ఇన్సూరెన్సు, డీజిల్ ధరలు తగ్గించి పోలీసు కేసులు నియంత్రిస్తే ప్రయోజనం ఉండేదని ఆటో డ్రైవర్లు వ్యాఖ్యానించారు. చేయూత లబ్ది వల్ల 40 ఏళ్ళ మహిళలు 45 ఏళ్లుగా వయసులు మార్చుకుని గతంలో ఏమమ్మా నీ వయసు 45 ఉంటుందా అంటే లేదు 35 ఆలా తప్పు వేసారు అన్న మహిళలు ఇప్పుడు 35,40 ఏళ్ళ మహిళలు 45 ఏళ్ళు గా ఇందులో ఎక్కువ శాతం వాలంటీర్స్ సలహా ఒప్పందాలతో అక్రమాలు చోటు చేసుకున్నాయని పలువురు ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శిస్తున్నారు. వాలంటీర్స్, వెల్ఫేర్ లు కలిసి ఆధార్ హిస్టరీ లను మార్చి మరీ అక్రమాలకు పాల్పడ్డారని కొందరు చెపుతున్నారు. నాడు -నేడు లో విద్యాలయాలు అభివృద్ధి మౌలిక వసుతుల, విద్యాకానుక, విద్యాదీవెన, మధ్యాహన్న భోజనం ఉండగా అమ్మఒడి దండగ అనే వాదన ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ విద్యాలయ ఫీజులు నియంత్రించి మౌలిక వసతుల అభివృద్ధి చేస్తే సరిపోతుందని సలహా ఇస్తున్నారు. మధ్యపాన నిషేధం అని మధ్యపాన దోపిడీ చేస్తున్నారని గతంలో బెల్ట్ దుకాణాలను పూర్తిగా నియంత్రిచారని, ఇప్పుడు మధ్యపాన నిషేధం అని చెప్పి ప్రభుత్వమే మద్యం దుకాణాలను పెట్టి అమ్మటం బెల్ట్ దుకానాలలో అధిక ధరలకు విక్రయిస్తున్న అటు ఎక్సయిజ్, పోలీస్ అధికారులు పట్టించుకోకపోవటం పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరత, సిమెంట్, ఇనుము ధరలు పెరగటం, కరోనా కష్టకాలంలో కార్మికులు పని లేక ఇటు మధ్యానికి అలవాటుపడ్డ కార్మికులు కుదెలయ్యారని ఆవేదన వ్యక్తం చేసారు. నవరత్నాలు అనే సంక్షేమ పథకాలతో అభివృద్ధిని మర్చిపోయిన ప్రభుత్వం అంటూ ప్రత్యక్షంగా ప్రజలు విమర్శిస్తున్నారు. వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే చాలా సందర్భాలలో ప్రజలలోకి వెళ్ళినప్పుడు ప్రజల నుండి వచ్చిన వ్యతిరేకతకు నీరుగారుతూ వైస్సార్సీపీ నాయకులు సైతం ప్రజలలోకి వెళ్ళ లోక పోతున్నట్టు ప్రతిపక్షాలు, జనంలోకి వెళ్తున్నట్టు చెప్తున్నారు.