జగనన్న ఇల్ల లబ్ధిదారులు ఇల్లు పొందటానికి చాలా అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న లబ్ది దారులు..?
జగనన్న ఇల్ల లబ్ధిదారులు ఇల్లు పొందటానికి చాలా అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న లబ్ది దారులు..?
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేద వారి కోసం ప్రవేశపెట్టిన జగనన్న ఇళ్ల లబ్ధిదారులు ఇల్లు పొందటానికి చాలా అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గృహ లబ్ధిదారులకు ఇళ్ల సమకూర్చే విధానంలో కొన్ని బ్యాంకులకు లబ్ధిదారులు యొక్క రుసుమును లోను పొందడానికి ప్రైవేటు బ్యాంకులకు అనుసంధానం చేయడం జరిగిందని, ఈ ప్రైవేటు బ్యాంకు వాళ్లు లబ్ధిదారుల దగ్గర అకౌంట్ ఓపెన్ చేయడానికి( ఐ సి ఐ సి ఐబ్యాంక్ )20,000 , (యాక్సెస్ బ్యాంక్) 15,000 రూపాయిలు అకౌంట్ ఓపెన్ చెయ్యడానికి అడుగుతున్నారని అలాగే ముఖ్యంగా : వేలి ముద్ర ఉన్న వాళ్ళకి అసలు అకౌంట్ ఓపెన్ చేయమని బ్యాంకు వాళ్ళు చెప్పినట్టు పలువురు లబ్ధిదారులు తెలియపరిచారు. చదువులేని మాలాంటి వాళ్లకు వేలి ముద్ర తప్ప సంతకం పెట్టడం ఎలా వస్తుందని, రోజు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే మా లాంటి పేదవారికి 20వేలు, 15 వేలు డబ్బులు బ్యాంకులకు కట్టి అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకుంటామని బ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం జగనన్న గృహ లబ్ధిదారులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పడం మాటల వరకే తప్ప చేతల్లో లేదని పలువురు లబ్ధిదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అలాగే కొన్ని ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాల్లో వేలిముద్ర కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో బ్యాంకు వాళ్ళు సంతకం కావాలి అనడం చాలా దురదృష్టకరమైన విషయం అని లబ్ధిదారులు ఆ వేదన పడుతున్నారు.ఈ విషయంపై స్థానిక మంత్రివర్యులు ,ఉన్నత అధికారులు దీనిపై దృష్టి సారించి బ్యాంకు అధికారులతో మాట్లాడి లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చేస్తారని లబ్ధిదారులు తెలియపరుస్తున్నారు…