చెరువులను తలపిస్తున్న విశాఖ నగరం.నీటమునిగిన గోపాలపట్నం పరిసర ప్రాంతాలు..

చెరువులను తలపిస్తున్న విశాఖ నగరం.నీటమునిగిన గోపాలపట్నం పరిసర ప్రాంతాలు..
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
గోపాలపట్నం మండలం. 89 వ వార్డు .పరిసర ప్రాంతాలైన. కొత్తపాలెం,ఎల్లపువాని పాలెం. శ్రీ దుర్గా నగర్ . భగత్ సింగ్ నగర్. పరదేశమ్మ నగర్ .తదితర కాలనీలన్నీ నీటమునిగాయి. మరియు పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి ఈ ప్రాంతంలో. 33/11కేవీ.విద్యుత్ ఉపకేంద్రం. కూడా పూర్తిగా నీట మునిగి పోయింది. సంబంధిత అధికారులు రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇటు వైపు చూసిన దాఖలాలు ఏమీ లేవు. సంబంధిత అధికారులు ముందు గా తేరుకొని ఇక్కడి ప్రజలను. ఈ ప్రాంత కాలనీవాసు లను. అప్రమత్తం చేసిన ఎడల ఇంత ఘోరం జరుగక పోవచ్చని స్థానిక గ్రామ ప్రజలు వాపోయారు. ముంపుకు గురవుతున్న ప్రాంతాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురి కాకుండా ఉండేవారని తెలిపారు. ఈ లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నదని గతంలో పలుమార్లు అధికారులకు రాజకీయ నాయకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది అదే మాదిరి ఇక్కడ పరిస్థితి చెరువులలో. కాలువలలో బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతూ ఉంటే ఇక్కడ అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారు. దాని ఫలితమే ఇది అని తెలిపారు. ఇక్కడి ప్రజలకు మురుగు నీరు పోవుటకు ప్రధాన డ్రైనేజీ వ్యవస్థ కొంతమేరకు ఉన్నా మిగతా భాగంలో పూర్తిగా లేనందువలన ఈ నష్టం వాటిల్లుతోంది అని స్థానిక గ్రామ ప్రజలు తెలిపారు. ప్రధానంగా ఈ సమస్య పై అధికారులు రాజకీయ నాయకులు దృష్టి సారించవలసిందిగా ఇక్కడి ప్రజలు చేతులెత్తి నమస్కరిస్తూ ఈ ప్రధాన సమస్యను వెంటనే పరిష్కరించి వలసిందిగా సంబంధిత అధికార. రాజకీయ .నాయకులను వేడుకుంటున్నారు.