Andhra PradeshVisakhapatnam
చినగదిలి మండల తాశీల్దార్ గా భాద్యతలను స్వీకరించిన లోకవరపు రామారావు.

చినగదిలి మండల తాశీల్దార్ గా భాద్యతలను స్వీకరించిన లోకవరపు రామారావు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
చినగదిలి మండలంలోని రూరల్ తహసీల్దార్ గా లోకవరపు రామారావు శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించి తన విధులు ప్రారంభించారు.క్యాపిటల్ వాయిస్ ప్రతినిధి తో మాట్లాడుతూ చిన గదిలి మండలంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ఈమేరకు ఆయన శుక్రవారం నుండి అందుబాటులో ఉండి సేవలందిస్తానని తెలిపారు. . ఎవరైనా ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని అటువంటి వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటానని తెలిపారు.ఈయన చోడవరం, వడ్డాది, మాడుగుల, ఎస్.కోట తదితర ప్రాంతాల్లో తహసీల్దార్ గా విధులు నిర్వహించానని తెలిపారు. అనంతరం తాశీల్దార్ సిబ్బందితోనూ, సచివాలయ వి. ఆర్. ఓ ల తోనూ సమావేశం ఏర్పాటుచేసి వారికి ఎటువంటి అవినీతుల కు పాల్పడవద్దని అందరు తమ తమ విధి నిర్వహణలు సక్రమంగా చేసుకోవాలని సూచించారు.తాశీల్దార్ లోకవరపు రామారావు కి క్రమంలో వీఆర్వో సత్యం దొర, కే అప్పారావు, శ్యామ్, రిజ్వాన్, ఆక్టాలు, ఇతర సిబ్బంది, సచివాలయ వి. ఆర్. ఓ లు తహసీల్దార్‌ను మర్యాదపూర్వకంగా అభినందనలు స్వీకరించారు.

