ఘనంగా విశ్వ జననేతకి71వ జన్మదిన వేడుకలలో రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రేమకుమారి
ఘనంగా విశ్వ జననేతకి71వ జన్మదిన వేడుకలలో రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రేమకుమారి

.రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రేమకుమారి.
మధురవాడ: అనూ ఇన్స్ ట్యూట్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్,విశాఖ మహిళ మోర్చా ఆధ్వర్యంలో జీవీఎంసీ జోన్-2 పరిధి మధురవాడ వాంబే కాలనీ లో మహిళలకు ఆరోగ్యంపై అవగాహన,మరియు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రేమకుమారి విచ్చేసారు ముందుగా ప్రధాని మోడీ కి మహిళల సమక్షంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక మహిళలకు ఆరోగ్యంపై అవగాహన, వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబానికి వెన్నెముకగా నిలిచి కుటుంబంలో అందరి బాగోగులు చూస్తున్న స్త్రీలు వారి ఆరోగ్యంపై శ్రద్ధ చూపరని. కనుకనే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని,ఆరోగ్యంపై స్త్రీలు అవగాహన కలిగి ఉండాలని కోరారు. ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు పెంచిన విశ్వ జననేత ప్రధాని మోడీ అని అన్నారు .కరోనా కష్టకాలంలో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా 80 కోట్ల పేదప్రజలకు,వలస కార్మికులకు ఉచిత బియ్యం,కందిపప్పు,నూనె , గోధుమపిండి అందజేశారని,చిరు వ్యాపారస్తులకు స్వనిదీ పథకం కింద 5వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందించారని.దళారీ వ్యవస్థకు చమర గీతంపాడి రైతుల ఖాతాలలో ఆన్లైన్లో నగదు జమ చేశారని,ఆత్మ నిర్భర భారత్ ద్వారా ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించారని,కరోనా ను కట్టడి చేయుటకు 35 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారని,అత్యంత ఆధునిక వసతులతో మూడు వేలకు పైగా హాస్పిటల్స్ ఏర్పాటు చేశారని,రోగుల సౌకర్యార్థం పి.ఎమ్.కేర్ కింద 63,000 వెంటిలేటర్ లను సిద్ధం చేశారని,పి.ఎమ్ కేర్ కింద 4 వేల వెంటిలేటర్ లను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారని అన్నారు.ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైనరాష్ట్ర ఎస్.సి కార్యవర్గ సభ్యులు కె.ఎన్.పి చక్రవర్తి మాట్లాడుతూ కరోనాను కట్టడి చేయుటకు అతి తక్కువ కాలంలో శాస్త్రవేత్తలను ప్రోత్సహించి కో-వ్యాక్సిన్,కోవి-షిల్డ్ కనుగొని ,సుమారు 80 కోట్ల మంది ప్రజలకు ఉచితముగా వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేశారని అన్నారు.దేశ అభివృద్ధికి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారని,పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని అన్నారు.ఈ కార్యక్రమంలో మహిళ మోర్చా అధ్యక్షురాలు ఉమ్మడి సుజాత, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రోహిణి, భువనేశ్వరి, అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ కృష్ణవేణి, మైనార్టీ మోర్చా అధ్యక్షులు తాటిపూడి ప్రదీప్, 4,5 వార్డు అధ్యక్షులు ధోని నాగరాజు, పవన్ కుమార్, మహిళా మోర్చా పదాధికారులు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కొలగట్ల వెంకటేష్, వైద్య సిబ్బంది, డా.సునీత, డా.నాగ సుధా లక్ష్మి ఎమ్.ఎస్.ఓ.బి.జి, డా.వినీలా, ఆఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.