గ్రేటర్ విశాఖ కార్యాలయం చేరువలో మురుగునీరు.

గ్రేటర్ విశాఖ కార్యాలయం చేరువలో మురుగునీరు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
జోన్ త్రీ జీవీఎంసీ కార్యాలయం కి అతి చేరువలో ఉన్న ఏరియా రాంనాగర్ చాకలి బ్రిడ్జి దగ్గర పార్క్ ఏరియా లో (28 వ వార్డు) గోతులు తవ్వి గత నెల రోజులుగా వదిలేసారు, లెవట్రీ నీళ్లు, కాలువ నీళ్లు నిలవ ఉండి పోయి దోమల బెడద ఎక్కువగా ఉంది, చుట్టుపక్కల అందరూ ఇబ్బంది పడుతున్నారు, ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుండి ఎవరికి బాలేదు జ్వరాలతో బాధపడుతున్నాము, ఈ నీళ్లు ఇలానే ఉంటే చుట్టుపక్కల అందరికి డెంగీ, మలేరియా అనే వ్యాధులు వచ్చే అవకాశం ఉంది,మరణాలు సంభవించే ప్రమాదం ఉంది అని జోనల్ కమీషనర్ కి, సానిటరీ ఇన్స్పెక్టర్ కి, కార్పొరేటర్ కి ఎన్నిసార్లు అర్జీలు పెట్టిన ఫలితం ఉండటం లేదు అని స్థానిక వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్ అప్పలకొండ ఆ స్థలం పై కోర్టులో కేస్ పెండింగ్ ఉండటంవల్ల చెయ్యాలకపోతున్నామనటం ఆశ్చర్యానికి గురి చేస్తుందని స్థానిక న్యాయవాది శివప్రసాద్ తెలిపారు. కోర్టులో కేస్ ఉన్నది పక్కన ఉన్న స్థలం పైన, ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగించేవాటికి న్యాయస్థానలు అడ్డు చెప్పవని కాలువ శుభ్రం చెయ్యటానికి ఇబ్బంది ఉండదని తెలిపిన పట్టించుకునే వారే లేరని న్యాయవాది శివప్రసాద్ తెలిపారు. ఇప్పటికైనా కమీషనర్ సృజన ఈ సమస్య పై స్పందించి సమస్య పరిష్కారం చెయ్యగలరు ఆశిస్తున్నామన్నారు . న్యాయవాది శివప్రసాద్, న్యాయవాది, రాంనగర్,28వ వార్డు