గోపాలపట్నం రహదారులకు మోక్షమెప్పుడు…?
గోపాలపట్నం రహదారులకు మోక్షమెప్పుడు…?
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
గోపాలపట్నం సుకన్య, సౌజన్య థియేటర్, ఎదురుగా ఏపీ ఎస్ ఆర్ టి సి బస్సు, ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురయ్యాయి, ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు కి కొద్దిపాటి గాయలయ్యాయి, ప్రమాదం గురయ్యిన వాహనదారుడు మద్యం సేవించి వర్షంలో రహదారులు గుంతలు లో నీరు చేరి బురదలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఏపీ ఎస్ ఆర్ టి సి బస్సు కిందకి వెళ్ళటంతో ప్రమాదం జరిగి బస్సు డ్రైవర్ ద్విచక్ర వాహనదారుణ్ణి గమనించి బస్సు ని అదుపు చెయ్యటంతో చిన్నపాటి గాయలతో బయటపడ్డాడని ప్రమాదం చూసిన అక్కడ ఉన్న ప్రజలు తెలిపారు. శనివారం వర్షంలో జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల కాసేపు గోపాలపట్నం రహదారులలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. దగ్గరలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది వచ్చి ప్రజలకు సర్ది చెప్పి వాహనాలను పంపించి దెబ్బలు తగిలిన ద్విచక్రవాహనదారుణ్ణి ఆసుపత్రికి తరలించి ట్రాఫిక్ని నియంత్రించారు.అక్కడ ఉన్న స్థానికులు మాట్లాడుతూ ఎన్. ఏ. డి జంక్షన్ మొదలు ఏపీ టూరిజం బి ఆర్ టి ఎస్ రోడ్ నుండి గోపాలపట్నం బంక్ వరకు ఉన్న రహదారులు మరమ్మతులు చెయ్యకపోవటంపై ఆదివారం వర్షంలో జరిగిన ప్రమాదంలో ప్రజలు ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు లో 24*7 మంచినీరు అందించే పైప్ లైన్ కొరకు రహదారులను తవ్వి మట్టితో పూడ్చిన తరువాత రహదారులు మరమ్మత్తులు చెయ్యకపోవటంవల్ల నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదలు జరుగుతున్నాయని గత ప్రభుత్వం లో ఎన్. ఏ డి జంక్షన్ నుండి పెందుర్తి వరకు బి. ఆర్. టి ఎస్ రోడ్డు లో ఏ పి ఎస్ ఆర్ టి సి బస్సు లు, మరియు పెద్ద వాహనాలను అనుమతించేవారని వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నవరత్నాలు పేరుతో సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి మర్చిపోయారని ముఖ్యంగా విశాఖపట్నం పరిపాలన రాజధాని అని చెప్పుకునే ప్రభుత్వమే విశాఖపట్నం రోడ్డు మరమ్మతులు చెయ్యటంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసారు.ఇప్పటికైనా ప్రభుత్వం రహదారులు పై జరుగుతున్న ప్రమాదాలను గుర్తించి తక్షణమే రహదారుల మరమ్మత్తులు చేసి ప్రమాదాలను నివారించాలని నాయకులను, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.