Bussiness

గూగుల్, ఫేస్‌బుక్ డౌన్…

వాషింగ్టన్ : కరోనా నేపధ్యంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలుఉన్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతోన్న నేపధ్యంలో…. ప్యాకేజీపై అనిశ్చితి కూడా తోడవడంతో స్టాక్స్ కుప్పకూలాయి. డౌజోన్స్ 650 పాయింట్లు (2.29 శాతం), ఎస్ అండ్ పీ 65 పాయింట్లు (1.86 శాతం), నాస్‌డాక్ 189 పాయింట్ల(1.64 శాతం) మేర క్షీణించాయి.

ఇన్వెస్టర్లలో ఆందోళన…

కరోనా కేసులు మళ్ళీ భారీగా పెరుగుతూండడంతో సోమవారం అమెరికా మార్కెట్ కుప్పకూలింది. ఎన్నికలకు ముందు ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఉండే సహాయక ప్యాకేజీపై అనిశ్చితి ఇన్వెస్టర్లలో పెరగడమే ఇందుకు కారణం. నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా… హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ 2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రతిపాదించారు. ప్రభుత్వ ప్రతిపాదిత ప్యాకేజీ కంటే ఇది అధికం. కాగా… ఈ ప్యాకేజీపై రిపబ్లికన్లు వ్యతిరేకత వ్యక్తం చేసినప్పటికీ భారీ ఆర్థిక ప్యాకేజీకి సిద్ధమని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ విషయమై ఆర్ధిక మంత్రిత్వ శాఖతో ట్రంప్ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో… సెంటిమెంట్ దెబ్బతినడంతోపాటు మరోవైపు కరోనా కేసులు కూడా భారీగానే పెరుగుతున్నాయి.

 

టెక్ దిగ్గజాలు డీలా…

ఆపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్ తదితర టెక్ దిగ్గజ సంస్థలు సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇక… ప్రధానంగా ట్రావెల్ స్టాక్స్ క్షీణించాయి. ఎయిర్ లైన్స్ స్టాక్స్ 3.5 శాతం నుండి 7 శాతం మధ్య పతనమయ్యాయి. కరోనా నేపధ్యంలో… రికవరీ ఆలస్యమవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒరాకిల్ స్టాక్స్ నాలుగు శాతం మేర క్షీణించగా, గూగుల్, ఫేస్‌బుక్ స్టాక్స్ కూడా దాదాపు 3 శాతం మేర నష్టపోయాయి. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మాత్రం లాభపడింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
%d bloggers like this: