గత మూడు రోజులుగా పడుతున్న వర్షం ధాటికి మునిగిన పంటలు, రైతులకు తీవ్ర నష్టం జిల్లా ప్రధాన కార్యదర్శి, పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్

గత మూడు రోజులుగా పడుతున్న వర్షం ధాటికి మునిగిన పంటలు, రైతులకు తీవ్ర నష్టం జిల్లా ప్రధాన కార్యదర్శి, పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
గులాబ్ తుఫాన్ బీభత్సానికి, నీట మునిగిన పంటలు, రైతులకు తీవ్ర నష్టం, భీమిలి పరిసర ప్రాంతాల్లో అలజడి సృష్టించిన గులాబ్ తుఫాన్ కారణంగా, ఆనందపురం మండలం, పద్మనాభం మండలం, భీమిలి రూరల్, మరియు విశాఖ జిల్లా రూరల్ మండలాల్లో, వరి పంట, అరటి, బొప్పాయి, కంది, వేరుశెనగ, మిరప, పూల తోటలు, ఆకు కూరలు, నీట మునిగి, భారీ నష్టాలు ఎదుర్కొంటున్న, రైతులు, అని, విశాఖ జిల్లా, కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో, జిల్లా ప్రధాన కార్యదర్శి, పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ , పర్యటించి,
తక్షణమే రైతులను ఆదుకోవాలని, వ్యవసాయ అధికారులు, పంట నష్టం అంచనా వేసి, తక్షణమే, నష్టపరిహారం అందించాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఆనందపురం మండలo లో, వెల్లంకి, గారి పేట,బి.పి.కల్లలు, పల్లిపేట, మచ్చ వానిపాలెం, పొడుగు పాలెం, పర్యటించారు. ఈ కార్యక్రమంలో బిజేపి ఆనందపురం మండల పార్టీ అధ్యక్షులు, మీసాల రాము నాయుడు, బిజేపి జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి, గండి లక్ష్మి రావు, మరియు బిజేపి నాయకులు పాల్గొన్నారు.