క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ని కలిసిన వెయిట్ లిఫ్టింగ్ అంతర్జాతీయ మెడలిస్టులు.
క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ని కలిసిన వెయిట్ లిఫ్టింగ్ అంతర్జాతీయ మెడలిస్టులు.
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
విశాఖపట్నం, సీతమ్మధార లోని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడా శాఖామంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు నివాసంలో జగన్ అన్న చేయూత ట్రస్ట్ చైర్మన్ & వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొలుసు మోహన్ యాదవ్ సమక్షంలో వెయిట్ లిఫ్టింగ్ అంతర్జాతీయ సిల్వర్ మెడలిస్ట్ రాజేశ్వరి , బ్రౌన్జ్ మెడలిస్ట్ రాజ్యలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా ముందుగా మంత్రి పూల బొకే, శాలువాతో సత్కరించారు. మంత్రి తో 2022 మార్చి నెలలో జరిగే అంతర్జాతీయ ఉమెన్స్ వెయిట్ లిఫ్టింగ్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున సహాయ సహకారాలు అందించ వలసిందిగా కోరారు. అనంతరం అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ మెడలిస్ట్ రాజేశ్వరి, రాజ్యలక్ష్మి లకు మంత్రి అవంతి
పూల బొకే,శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జగన్ అన్న చేయూత ట్రస్ట్ సెక్రటరీ వేగూరు హేమంత్ మరియు నాయకులు పాల్గొన్నారు.