Andhra PradeshVisakhapatnam
కార్యకర్తలకు అండగా నిలిచిన పార్టీ జనసేన విశాఖలో నాదెంట్ల మనోహర్
కార్యకర్తలకు అండగా నిలిచిన పార్టీ జనసేన విశాఖలో నాదెంట్ల మనోహర్
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
కార్యకర్తలకు అండగా నిరంతరం పార్టీ కృషి చేస్తుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ముందుగా నాదెండ్ల మనోహర్ కు స్టేడియం వద్ద జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వివిధ కారణాలతో మరణించిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల చెక్కును ఆయన శనివారం అందించారు. ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు మౌలిక వసతులు మెరుగుపరదాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను మరచి వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై పెత్తనం చెలాయించేందుకు ఉత్సాహపడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రం లో రాక్షస పాలన నడుస్తుందని, ప్రశ్నించిన వారిపై అనేక రకాలుగా హింస పెట్టీ కేసులు పెడుతున్నారన్నారు. ప్రజలను పథకాల పేరుతో మబ్బి పెడుతున్నారని, కేంద్ర ప్రభుత్వ ఇస్తున్న పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు ప్రచారాలు చేయటం అన్యాయమని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకున్న జలవివాదంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి చిత్తశుద్ధి, నిజాయతీ వుంటే తన వైఖరిని ప్రజలకు తెలియజేయాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. హక్కుగా రావాల్సిన నీటి కోసం సీఎం ఎందుకు పోరాటం చేయలేకపోతున్నారని ఆయన నిలదీశారు. డాక్టర్ సందీప్ పంచకర్ల ఆధ్వర్యంలో,నాగొతి అమరావతి నాయుడు, పిల్లా శ్రీను, ఆకుల శివ, జగ్గుపిల్లి నాని, వెంకటేష్, చిట్టి రెడ్డి, శకరి శ్రీను, పోతిన నానాజీ, అనురాధ, సంతోష్ నాయుడు, వి చిన్న, పి త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు.
