కరెంట్ బిల్లులు చెల్లించే కేంద్రాలు లేక ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు..!— టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు
కరెంట్ బిల్లులు చెల్లించే కేంద్రాలు లేక ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు..!— టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు
ప్రతీనెల కరెంటు బిల్లులు ఇస్తే సరిపోదని, బిల్లులు చెల్లించే కేంద్రాలు కూడా ఉండాలని ఎలక్ట్రికల్ అధికారులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భీమిలి డివిజన్ అధ్యక్షులు గంటా నూకరాజు సూచించారు.తెలుగుదేశం పార్టీ భీమిలి కార్యాలయం నందు గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన కరెంటు బిల్లులు ఎక్కడ కట్టాలో తెలియక వినియోగదారులు అవస్థలు పడుతున్నారని అన్నారు. ప్రతీనెల ఇంటింటికి వెళ్లి కరెంటు బిల్లు ఇస్తే సరిలోదని బిల్లులు చెల్లించే కేంద్రం కూడా ఉండాలని అన్నారు. గతంలో భీమిలి గంటస్థంభం వద్ద బిల్లు చెల్లింపు కేంద్రాలు ఏర్పాటు చేశారని, కానీ నేడు ఆ కేంద్రం ఎత్తివేయడంతో కరెంటు వినియోగదారులు నానా రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని గంటా నూకరాజు అన్నారు. కరెంటు కార్యాలయానికి వెళితే ఆన్లైన్ ద్వారా కరెంటు బిల్లు కట్టమని సమాధానం వస్తుందని, ఎంతమందికి ఆన్లైన్ సౌకర్యాలు ఉన్నాయని గంటా నూకరాజు అన్నారు. ఆన్లైన్ లో బిల్లు కట్టడం తెలియక వినియోగదారులు ఒకపక్క ఇబ్బందులు పడుతుంటే, మరోపక్క బిల్లు చెల్లింపులు కాస్త లేటయితే కనెక్షన్ తొలగించడం జరుగుతుందని అన్నారు. ఇంతకీ గంటస్థంభం వద్ద ఉన్న కరెంటు బిల్లులు చెల్లింపు కేంద్రాన్ని ఎందుకు ఎత్తేసారో సమాధానం చెప్పాలని ఏపీ ఈపిడిసిఎల్ అధికారులు సమాధానం చెప్పాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వినియోగ దారులకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని చెబుతుంటే, కరెంటు కార్యాలయ అధికారులు మాత్రం వినియోగదారులకు సమస్యలు మీద సమస్యలు సృష్టించి చుక్కలు చూపిస్తున్నారని గంటా నూరాజు అన్నారు. ఎక్కువమంది నిరక్షరాస్యులు ఉన్న ఏరియాలో ఆన్లైన్ చెల్లింపులు సమస్యగా మారే ప్రమాదం ఉందని, దయచేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు వినియోగదారుల సౌలభ్యం కోసం భీమిలి గంటస్థంభం వద్ద బిల్లు చెల్లింపు కేంద్రాన్ని పునఃప్రారంభం చేయవసినదిగా కోరుతున్నామని గంటా నూకరాజు విజ్ఞప్తి చేశారు.