Andhra PradeshVisakhapatnam
కనికరించని సాంకేతిక పాలిటెక్నిక్ కాలేజి యాజమాన్యం..??

కనికరించని సాంకేతిక పాలిటెక్నిక్ కాలేజి యాజమాన్యం..??
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
ప్రతి విద్యార్థికి సంపూర్ణమైన చదువు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది కొంతమందికి జగనన్న విద్యా దీవెన వంటి పలు పథకాలు వర్తించవు రావు అలాంటి వారు చాలా ఇబ్బంది పడుతున్నారు కరోనా మహమ్మారి వల్ల వ్యాపారాలు సాగక రెండు సంవత్సరాల నుండి కష్టకాలంలో జీవించిస్తున్న సగటు మనిషికి జీవించడం చాలా కష్టంగా ఉంది మధ్యతరగతి తల్లిదండ్రులకి ఇలాంటి పరిస్థితుల్లో వారి పిల్లలకు ఫీజులు బ్యాలెన్స్ ఉండిపోయారని పరీక్షలు పెట్టుకవడం వల్ల చాలా కలత చెందుతున్నారు కొంత టైం ఇవ్వండి ప్లీజ్ కడతావని యాజమాన్యని కాళ్ల మీద పడి బ్రతిమలాడిన కాలేజీ యాజమాన్యాలు కనికరించడం లేదని బాధ పడుతున్నారు. మాకు ఏం తెలియదు ఇప్పుడు ఫీజు కడితేనే పరిక్ష రాయనిస్తాం లేదంటే బయటకు పోండి అని విద్యార్థుల తల్లిదండ్రులను గెంటి వేస్తున్నారు ఇలా చేయడం వల్ల కాలేజీలో చదువుకునే పిల్లలు టీనేజ్ వయసు వారు కావడం వలన తెలిసి తెలియని వయస్సు కావడంతో మనస్దాపం చెంది ఎదైనా అగాయిత్యం చేసుకుంటే ఎవరు బాధ్యులు అని తల్లిదండ్రులు, మేధావి వర్గాల వారు అంటున్నారు మంగళవారం మధురవాడలో ఉన్న సాంకేతిక పాలిటెక్నిక్ కాలేజిలో మొదటి సంవత్సరం పరీక్షలకు వెళ్ళిన విద్యార్థులను యాజమాన్యం ఫీజు బ్యాలెన్స్ చెల్లిస్తే గాని ఎగ్జామ్ రాయనియమని పిల్లలను భయపెట్టడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కాలేజీకి రప్పించుకున్నారు కాలేజ్ కి వచ్చిన విద్యార్దుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ ని కాలు పట్టుకొని కొన్ని రోజులు గడువు ఇవ్వండి ఫీజు కడతామని బ్రతిమలాడగా కాలేజి ప్రిన్సిపాల్ కుదరదు ఇప్పుడు డబ్బులు కడితేనే పరీక్ష లేదంటే బయటకు పోండి అని బయటకు గెంటి వేయడంతో తల్లిదండ్రులు తీవ్రమైన మనోవేదన చెందుతున్నామని చెప్పారు.ప్రతి వ్యక్తి మంచి విద్యను అభ్యసించి ప్రయోజకులు కావాలనే ఆకాంక్షతో సుంకరి.అల్వార్ దాసు గారు సాంకేతిక కళాశాలను మంచి ఉద్దేశ్యంతో స్దాపించారని ఇప్పుడు ఉన్న యాజమాన్యం ధనార్జనే ద్యేయంగా మాట్లాడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపి కళాశాల యాజమాన్యాన్ని శిక్షించి విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్దకం కాకుండా చూడాలని ప్రజా సంఘాల వారు విద్యార్థుల తల్లిదండ్రులు,మానవహక్కుల సంఘాల నాయకులు కోరుకుంటున్నారు.
