Andhra PradeshPolitics
ఒకే ఒక్కడు రాష్ట్రానికి దిక్సూచి సీఎం జగన్ మోహన్ రెడ్డి- ఎమ్మెల్యే డా.గోపి రెడ్డి శ్రీనివాసరెడ్డి

ఒకే ఒక్కడు రాష్ట్రానికి దిక్సూచి సీఎం జగన్ మోహన్ రెడ్డి- ఎమ్మెల్యే డా.గోపి రెడ్డి శ్రీనివాసరెడ్డి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచి, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వాటి ఫలాలు ప్రతి ఇంటికి చేరడం వల్లనే రాష్ట్రంలో మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలలో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని అన్నారు. గురువారం స్థానిక రెండో వార్డులో గుడ్ మార్నింగ్ నరసరావుపేట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సంక్షేమ పథకాలు అందుతున్న తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా చిన్న చిన్న కారణాలతో పదకాలు అందకపోతే సవరణ చేసి వాటిని లబ్ధిదారులకు ఉండేవిధంగా చూడాలని స్పాట్లోనే అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తున్నారు . వార్డులో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ప్రతిరోజు ఇంటింటికి తిరుగుతూ సమస్యలు పరిష్కరించడంలో సఫలీకృతులయ్యారన్నారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, సాంకేతిక కారణాల వల్ల మొదటి విడతలో పట్టాలు పొందని వారు 90 రోజుల లోపు మరలా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఇప్పటికే పట్టణ పరిధిలో 8,500 మందికి ఇళ్ల స్థలాల పంపిణీ చేశామన్నారు. నరసరావుపేటలో 38 వార్డులలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు గెలుస్తారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానుకగా నరసరావుపేట మున్సిపాలిటీ అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి, మున్సిపల్ శానిటరీ సిబ్బంది, విద్యుత్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.