Andhra Pradeshkrishna
ఏఆర్ కానిస్టేబుల్ కి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి కల్పించిన జిల్లా ఎస్పీ

క్యాపిటల్ వాయిస్ ( కృష్ణాజిల్లా) మచిలీపట్నం :- ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న 2009 వ సంవత్సరం బ్యాచ్కు చెందిన వి శివనాగరాజు ARPC-1524 కు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి కల్పిస్తూ ఈరోజు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఉత్తర్వులు జారీ చేశారు. సుదీర్ఘకాలం పాటు పోలీసు శాఖలో పని చేసినప్పటికీ ఒక్క ప్రమోషన్ కూడా పొందకుండా ఎంతో మంది పదవీ విరమణ పొందుతున్నారు. ఇకపై అలాంటి వాటికి అవకాశం లేకుండా, పదవీ విరమణ పొందిన అనంతరం ఏర్పడిన ఖాళీల ఆధారంగా పదోన్నతులు కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలియజేస్తూ, పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుల్ ను అభినందించి, మరింత బాధ్యతగా విధులు నిర్వర్తించాలని తెలియజేశారు.