ఎ బి సి కేంద్రాన్ని తనిఖీ చేసిన కమిషనర్

ఎ బి సి కేంద్రాన్ని తనిఖీ చేసిన కమిషనర్
క్యాపిటల్ వాయిస్ జిల్లా ప్రతినిధి, నెల్లూరు :-నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హెడ్ వాటర్ వర్క్స్ వద్ద ఉన్న ఏ బి సి కేంద్రాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు .ఈ సందర్భంగా కమిషనర్ నగరపాలక సంస్థ వీధి శునకాల జనన నియంత్రణ కేంద్రంలో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్న వసతులను వెటర్నరీ డాక్టర్ మదన్మోహన్ ను అడిగి తెలుసుకున్నారు.
ఏ బి సి కేంద్రానికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. నగరంలో రోజుకు ఎన్ని శునకాలను పడుతున్నారని వెటర్నరీ డాక్టర్ ను కమిషనర్ ప్రశ్నించారు అదేవిధంగా వాటి శస్త్రచికిత్సలకు అవసరమైన పరికరాలన్నీ ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు .వీధి కుక్కలోవ్యాధుల బారిన పడిన వాటిని ఒకచోట, బాగున్న వాటిని మరోచోట పెట్టి శస్త్ర చికిత్సలు నిర్వహించాలని కమిషనర్ వారికి ఆదేశించారు. కుక్కలకు అవసరమైన సౌకర్యాలను అక్కడ ఏర్పాటు చేయాలని కమిషనర్ సూచించారు. అలాగే కమిషనర్ హెడ్ వాటర్ వర్క్స్ వద్ద ఉన్న డి కంపోస్ట్ యాడ్ తనిఖీ చేశారు.40,42,49డివిజన్ లనుండి తీసుకొని వస్తున్నా తడి చెత్తను డి కంపోస్ట్ యాడ్ తరలించి అక్కడ ఎరువుగా మారుస్తున్నారు. దాన్ని కమిషనర్ పరిశీలించారు .
ఆ ప్రాంతంలో దుర్వాసన రాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం కమిషనర్, కలరా షెడ్ వద్ద ఉన్న వెహికల్ షెడ్ తనిఖీ చేశారు అక్కడ రికార్డులను పరిశీలించారు. వాహనాల నిర్వహణ తదితర తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రయ్య, డి ఈ నాగేంద్ర కుమార్,ఎఇ మాథవి,శానిటరి ఇన్స్పెక్టర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు