Andhra PradeshVisakhapatnam
ఎయిడెడ్ విద్యా సంస్థలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన టీడీపీ!

ఎయిడెడ్ విద్యా సంస్థలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన టీడీపీ!
క్యాపిటల్ వాయిస్ :విశాఖపట్నం ప్రతినిధి
విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు,ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ ఆదేశాలు మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ ఆధ్వర్యంలో ఎయిడెడ్ విద్యా సంస్థలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ కోరాడ రాజబాబు, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ బాబు ,టీడీపీ విశాఖ పార్లమెంట్ కార్యదర్శి పాసర్ల ప్రసాద్,టి ఎన్ టి యూ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ రాష్ట్ర టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు .